క్రికెట్ లో ఎన్నో సంచలనాలు సృష్టిస్తూ తనకంటూ ఒక పేరు సాధించుకున్న భారత్ క్రికెట్ జట్టు, పేస్ బౌలింగ్ విభాగం లో మాత్రం ప్రపంచ స్థాయి బౌలర్లను చాలా దశాబ్దాల వరకు తాయారు చేయలేకపోయింది.

ప్రస్తుత క్రికెట్ లో అత్యుత్తమ పేస్ బౌలింగ్ ఉన్న జట్లలో భారత్ ఒకటి కావడం విశేషం కాగా, వేగవంతమైన బౌలర్లు గత రెండు దశాబ్దాల్లో చాలానే పెరిగారు. భారత్ క్రికెట్ లో వేసిన అత్యంత వేగవంతమైన 5 బంతులు ఇవే.

#5. ఆశిష్ నెహ్రా- 149.7 kmph 

India’s Ashish Nehra, celebrates the wicket of England’s Sam Billings during their second Twenty20 international cricket match at Vidarbha cricket association stadium in Nagpur, India, Sunday, Jan 29, 2017. (AP Photo/Rajanish Kakade)

తన కెరీర్ లో గాయాలతో ఎంతో సతమతమైన ఆశిష్ నెహ్రా, ఇటీవలే రిటైర్ అయినా సమయానికి తనకంటూ భారత్ చరిత్రలో ఒక పేరు రచించాడు.

అయితే గాయాలు లేని సమయం లో ఆశిష్ నెహ్రా, ప్రపంచం లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. 2003 ప్రపంచ కప్ అతని కెరీర్ లోనే కీలక టోర్నమెంట్. ఇంగ్లాండ్ అపి అయన తీసిన ఆరు వికెట్లు అందరికి గుర్తుండిపోతుంది. అయితే అదే టోర్నీలో జింబాబ్వే పై నెహ్రా 149.7 kmph బంతిని వేసాడు.