మూడో టెస్టులో టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టుకు సౌత్ ఆఫ్రికా పేస్ బౌలర్లు చాలా గట్టి జవాబు ఇచ్చారు.

ఓపెనర్లు మురళి విజయ్, కే ఎల్ రాహుల్ ను 13 పరుగులకే అవుట్ చేసి మరో ముందంజ వేశారు. అయితే మూడో స్థానం లో వచ్చిన చేటేశ్వర్ పుజారా, మిడిల్ ఆర్డర్ లో అవీచిన విరాట్ కోహ్లీ భారత్ ఇన్నింగ్స్ ను పటిష్ట పరిచారు.

ఒక వైపు పుజారా తన దృఢమైన డిఫెన్స్ తో సౌత్ ఆఫ్రికా బౌలర్లను నిలువరించగా, విరాట్ కోహ్లీ తనదైన శైలిలో చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. పుజారా తన 55 వ బంతికి తన తొలి పరుగు తీయగా, విరాట్ కోహ్లీ మాత్రం తనకు దక్కిన అదృష్టాన్ని సద్వినియోగం చేస్కుంటూ కెరీర్ లో 16 వ అర్ధ శతకం సాధించాడు.

తన అర్ధ శతకం లో రెండు సార్లు సౌత్ ఆఫ్రికా ఫీల్డర్లు క్యాచ్ వదిలేయడం గమనార్హం. తొలుత వెర్నాన్ ఫిలాండర్ మిడ్ ఆఫ్ దిశగా వెళ్లిన సాధారణ క్యాచ్ ను నేలపాలు చేయగా, లంచ్ తరువాత ఏ బి డివిల్లీర్స్ స్లిప్స్ లో క్లిష్టమైన క్యాచ్ ను జారవిడిచారు.

అయితే రెండో టెస్టులో అరంగ్రేటం చేసిన ఎంగిడి, విరాట్ కోహ్లీ ను వరుసగా ఇబంది పెడుతుండగా, చివరికి అతని వికెట్ చేజిక్కిచుకున్నాడు. ఆఫ్ స్టంప్ కు అవుతల పడిన బంతిని డ్రైవ్ చేయడానికి ప్రయత్నించినా విరాట్ కోహ్లీ, బాట్ ఏద్గె కు తగిలి స్లిప్ ఫీల్డర్ల దిశగా వేగంగా వెళ్ళింది.

అయితే డివిల్లీర్స్ మరో సారి తప్పు చేయకుండా అద్భుతమైన క్యాచ్ పట్టి భారత్ కెప్టెన్ ను పెవిలియన్ కు పంపాడు.

విరాట్ కోహ్లీ వికెట్ ను మీరే చూడండి

SHARE