తొలి టెస్టులో రాణించని విరాట్ కోహ్లీ, చాలా విమర్శలే ఎదుర్కొన్నాడు. అయితే రెండో టెస్టులో భారత్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడ్డు బాటింగ్ కు వచ్చిన భారత కెప్టెన్, తన కెరీర్ లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ లో ఒకటైన ప్రత్యేకమైన ఇన్నింగ్స్ సౌత్ ఆఫ్రికా పై ఆడాడు.

తొలి టెస్టులో కేవలం 5, 28 పరుగులు సాధించిన విరాట్, రెండో టెస్టులో భారత్ 28 -2 ఉన్న పరిస్థితిలో బాటింగ్ కు వచ్చాడు. అయితే వేరే బాట్స్మన్ వరుసగా ఔట్ అవుతూనే ఉన్న, కెప్టెన్ కోహ్లీ మాత్రం ఎటువంటి వత్తిడి లేకుండా సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఎదుర్కొంటు తన సెంచరీ సాధించాడు.

 

టెస్ట్ కెరీర్ లో తన 21 వ సెంచరీ కొట్టిన కోహ్లీ, సౌత్ ఆఫ్రికా లో రెండు సెంచరీలు సాధించిన రెండో బాట్స్మన్ గా రికార్డు కూడా సాధించాడు.

మూడో రోజు తొలి సెషన్ లో సెంచరీ ని సాధించిన విరాట్ కోహ్లీ, 67 వ ఓవర్ లో బంతిని ఆన్ సైడ్ ఆడి సింగల్ తీసాడు, అయితే వెంటనే సంబరాన్ని చేసుకున్న కోహ్లీ, ఓవర్ త్రోస్ తో రెండో పరుగు పరిగెత్తాడు. రెండు పరుగులు పూర్తి చేసిన తర్వాత విరాట్ గాలిలో ఎగురుతూ చాలా ఉద్వేగానికి గురిఅయ్యాడు.

విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన వీడియో ను మీరే చూడండి

  • SHARE