భారత్ యువ క్రికెటర్ విజయ్ శంకర్ తన అరంగ్రేటం చేసిన నిదాహస్ ట్రోఫీ ఫైనల్ లోని 18 వ ఓవర్ వరకు అద్భుతంగా ఆడాడు. అతను ముక్కోణపు సిరీస్ లో ఒక మ్యాచ్ లో మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.

బంతితో అంచనాలకు మించి రాణించిన శంకర్, ఫీల్డింగ్ లో కూడా తన సత్తా చాటాడు. ఐతే బాట్ తో తనకు వచ్చిన తొలి అవకాశంలో తన పై ఉన్న అంచనాలను అందుకోలేకపోయారు. భారత్ కు రన్ రేట్ 10 పైగా కావాల్సిన సమయంలో 19 బంతుల్లో కేవలం 17 పరుగులు చేసి అందరి దృష్టిని అవాంఛితంగా ఆకర్షించాడు.

Indian cricketer Vijay Shankar (R) celebrates after he dismissed Bangladesh cricketer Mushfiqur Rahim during the second Twenty20 (T20) international cricket match between Bangladesh and India of the tri-nation Nidahas Trophy at the R. Premadasa stadium in Colombo on March 8, 2018.
The Nidahas Trophy tri-nation Twenty20 tournament involving Sri Lanka, Bangladesh and India. / AFP PHOTO (Photo credit should read /AFP/Getty Images)

18 వ ఓవర్లో ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలింగ్ వరుసగా నాలుగు బంతులు మిస్ చేసిన విజయ్ శంకర్, ఆఖరి ఓవర్ లో మరో బంతిని మిస్ చేసాడు. కానీ దినేష్ కార్తీక్ ఆడిన సంచలన ఇన్నింగ్స్ తో భారత్ విజయానికి చేరింది. కేవలం 8 బంతుల్లో 29 పరుగులు చేసిన కార్తీక్, ఆఖరి బంతిని సిక్స్ గా మరల్చి భారత్ అభిమానులకు మరిచిపోలేని విజయం చేకూర్చాడు.

ఐతే మ్యాచ్ అయ్యి రెండు రోజులు అయినా తరువాత కూడా విజయ్ శంకర్ మాత్రం ఇంకా తాను ఆడిన ఐదు డాట్ బంతులపై అసంతృప్తిగానే ఉన్నాడు.

“నేను ఇంకా ఆ ఐదు డాట్ బంతుల గురించి చాలా అసంతృప్తిగా ఉన్నాను . ఆఖరి రెండు బంతుల్లో మ్యాచ్ ఫినిష్ చేయలేకపోవడం ఇంకా అసంతృప్తిని కల్పిస్తుంది. మూడో బంతిని ముఖ్యమైన ఫోర్ కొట్టక, తరువాత అవుట్ అయ్యాను.

“అంతర్జాతీయ క్రికెట్ లో తొలి మ్యాచ్ లోనే అలాంటి అవకాశం రావడం చాలా అరుదు. నేను ఇలాంటి పరిస్థితుల్లో ఆడటానికి చాలా కస్టపడి ప్రిపేర్ అయ్యాను, కానీ అలాంటి సమయంలో అవుట్ అవ్వడం చాలా బాధను కలిగించింది,” అని విజయ్ శంకర్ అన్నాడు.

ముస్తాఫిజుర్ రెహమాన్ తో కలిసి సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడిన విజయ్ శంకర్, అలాంటి అద్భుతమైన డెత్ బౌలర్ ను ఎదుర్కోవడం అసాధారణం అని చెప్పాడు. ఈ ఏడాది అతను ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఐపీఎల్ లో ప్రాతినిధ్యం వహిచనున్నాడు.

SHARE