మాజీ ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, గత వారం రోజులుగా క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన బాల్ టాంపరింగ్ వివాదంపై చివరకు మీడియా ముందుకు వచ్చాడు.

బాల్ టాంపరింగ్ పాలుపడ్డ ముగ్గురు క్రికెటర్లలో వార్నర్ ఒకడు కాగా, కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరియు యువ క్రికెటర్ కామెరాన్ బాన్ క్రాఫ్ట్ మిగిలిన ఇద్దరు క్రికెటర్లు. 31 ఏళ్ళు కలిగి ఉన్న డేవిడ్ వార్నర్ ను పలు రకాల విషయాలను పరిగణలోకి తీస్కొని అతనిపై వేటు వేశారు క్రికెట్ ఆస్ట్రేలియా.

బాన్ క్రాఫ్ట్ కు టాంపరింగ్ ఎలా చేయాలో చూపించడాన్న అభియోగంపై , తనకు తెలిసిన విషయాలను మ్యాచ్ రిఫరీ ముందు నిజాయితీగా ఒప్పుకొన్నందుకు అతని పై 12 నెలల వేటు వేశారు. దానితో పాటు అతని ఐపీఎల్ కాంట్రాక్టు కూడా పోయింది. బీసీసీఐ కూడా స్మిత్ మరియు వార్నర్ ను ఐపీఎల్ ఆడకూడదని నిర్ణయం తీసుకోవడం కొసమెరుపు.

ఐతే అంతే కాకుండా ఆస్ట్రేలియా బోర్డు అతన్ని భవిష్యత్తులో ఎప్పుడు ఆస్ట్రేలియాకు కెప్టెన్ గా కూడా ఉండదని ఆంక్షను విధించింది. అయితే మీడియా తో శనివారం మాట్లాడిన వార్నర్, భవిష్యత్తులో ఆస్ట్రేలియా మళ్ళీ ఆడలేకపోవచ్చు అని బాధ పడ్డాడు.

“ఈ విషయంలో నాకు పూర్తి బాధ్యత వహించాలని నేను ఇక్కడ ఉన్నాను. ఇది చాలా విచారకరమైన సంఘటన, నన్ను క్షమించండి. నేను నా స్వంత చర్యలకు పూర్తి బాధ్యత వహిస్తాను, అది తీసుకువచ్చే పర్యవసానాలను నేను గుర్తించాను,” అని వార్నర్ చెప్పాడు.

“నేను ఇష్టపడే నా జట్టు సభ్యులతో రంగంలోకి రాలేనని తెలుసుకోవడమే ఇబ్బందిగా ఉంది. భవిష్యత్తు ఏంటో తెలియదు కానీ నా కుటుంబం యొక్క శ్రేయస్సు ప్రధమం. నేను మిమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచాను.

“మీరు నాకు ఇచ్చిన మద్దతు, ప్రేమను మీకు తిరిగి ఇవ్వటానికి వీలైనంత ప్రయత్నిస్తాను మరియు బహుశా మీ గౌరవాన్ని సంపాదిస్తానని ఆశ పడుతున్నాను. నా సహచరులు మరియు మద్దతు సిబ్బందికి, నా చర్యలకు నేను క్షమాపణ చేస్తున్నాను, న్యూలాండ్స్ టెస్ట్లో మూడు రోజులలో జరిగిన దానిపై నేను పూర్తిగా బాధ్యత వహించాను, ” అని .వార్నర్ అన్నాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ కు కీలక ఆటగాడైన డేవిడ్ వార్నర్ లేకపోవడం చాలా బాధను కలిగించే విషయమైనప్పటికీ, ఇక ముందు ఇలాంటి బాల్ టాంపరింగ్ వివాదాలు జరగకూడదని కోరుకుందాం.

SHARE