ఇటీవలే జరిగిన బాల్ టాంపరింగ్ వివాదం తో ఆస్ట్రేలియా మరియు ప్రపంచ క్రికెట్ కమ్యూనిటీ అందరు దిగ్బ్రాంతికి గురి అయ్యారు. ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ గురువారం కేప్ టౌన్ నుండి సిడ్నీ కు వెళ్లిన తరువాత మీడియా ప్రతినిధులతో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసాడు.

ఐతే అతను మీడియా వారితో మాట్లాడుతూ చాలా సార్లు భావోద్వేగాలకు గురి అవుతు చివరకు కంట తడి పెట్టాడు. ఈ తరంలో క్రికెట్లోనే అత్యంత టాలెంట్ ఉన్న ఆటగాళ్లలో ఒకడైన స్టీవ్ స్మిత్, బాల్ టాంపరింగ్ లో దోషిగా తేలడంతో అతని పై క్రికెట్ ఆస్ట్రేలియా 12 నెలల పాటు వేటు విధించింది.

అలానే అతను మరో 12 నెలల వరకు కెప్టెన్సీ కి కూడా అర్హుడు కాదు. క్రికెట్ ఆటకు మచ్చ తెచ్చిన ఈ సంఘటన కు తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్టు స్మిత్ చెప్పాడు.

“నేను ఎవరినీ నిందించలేను. నేను ఆస్ట్రేలియన్ జట్టు కెప్టెన్ ను. ఇది నా పర్యవేక్షణలో జరిగింది. గత శనివారం ఏమి జరిగిందో అంతటికి నేను బాధ్యుడిని. క్రికెట్ ప్రపంచంలోని గొప్ప క్రీడ. అదే నా జీవితం మరియు మళ్ళీ అది అలానే నా జీవితం లో ఉంటుంది అని ఆశిస్తున్నాను,” అని అన్నాడు స్మిత్.

అతని తో పాటు వైస్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ పై కూడా 12 నెలల వేటు పడగా, యువ క్రికెటర్ కామెరాన్ బాన్ క్రాఫ్ట్ ను తొమ్మిది నెలల పాటు జట్టు నుండి బహిష్కరించారు. ఐతే ఆస్ట్రేలియా జనాభా ను తన క్షమాపణ కోరిన స్మిత్, త్వరలో వారి గౌరవాన్ని మరల పొందేందుకు ప్రయత్నిస్తాను అని చెప్పాడు.

“నన్ను క్షమించండి. ఇతరులకి పాఠం ఏమైనా ఉంటే ఏవైనా మంచి రావచ్చు, అప్పుడు నేను మార్పు కోసం ఒక శక్తిగా ఉండవచ్చని ఆశిస్తున్నాను. నా జీవితాంతం నేను చింతిస్తాను. మీ యొక్క గౌరవం మరియు క్షమను మరల సంపాదించగల నేను ఆశిస్తున్నాను “అని స్మిత్ అన్నాడు.

SHARE