బాంగ్లాదేశ్ పై శనివారం జరిగిన టీ 20 మ్యాచ్ లో శ్రీలంక స్లో ఓవర్ రేట్ కారణం గా ఆ జట్టు కెప్టెన్ దినేష్ చండీమల్ పై వేటు పడింది. అతను శ్రీలంక ఆడబోయే తదుపరి రెండు టీ 20 ల నుండి సస్పెండ్ అయ్యాడు అని ఐసీసీ వెల్లడించింది.

అయితే 20 ఓవర్లు వేయాల్సిన సమయానికి కేవలం 16 ఓవర్లు మాత్రమే పూర్తి చేసిన శ్రీలంక వలన అతను ప్రస్తుతం జరుగుతున్న నిదాహాస్ ట్రోఫీ లో తదుపరి రెండు మ్యాచ్లు ఆడలేడు.

తద్వారా సోమవారం భారత్ తో జరిగే మ్యాచ్, తదుపరి బాంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో అతను లేకుండానే శ్రీలంక ఆడాల్సి ఉంది.

అయితే శ్రీలంక జట్టులో వేరే ఆటగాళ్లు అందరిపై 60 శాతం మ్యాచ్ ఫీజు లో కొత్త విధిస్తున్నట్టు, ఐసీసీ ప్రకటన విడుదల చేసింది. బాంగ్లాదేశ్ కూడా ఇదే మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ వేయడం విశేషం.

కానీ వారిది చిన్న తప్పు కావడం తో కెప్టెన్ మహ్మదుల్లా కు 20 శాతం మ్యాచ్ ఫీజులో కొత్త విధించగా, బాంగ్లాదేశ్ జట్టు లో అందరి ఆటగాళ్లకు 10 శాతం కొత్త విధించారు.

Bangladeshes’ Mushfiqur Rahim, right, celebrates his team’s victory over Sri Lanka as Thisara Perera watches in their Twenty20 cricket match in Nidahas triangular series in Colombo, Sri Lanka, Saturday, March 10, 2018. (AP Photo/Eranga Jayawardena)

తొలుత బాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణిత 20 ఓవర్లలో 214 పరుగులు చేయగా, బాంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముషఫీకూర్ రహీమ్ సంచలన ఇన్నింగ్స్ తో 215 పరుగులను అలవోకగా ఛేదించారు.

బాంగ్లాదేశ్ శ్రీలంక పై విజయం సాధించడంతో ముక్కోణపు సిరీస్ రసవత్తరంగా మారింది. పాల్గొంటున్న భారత్, శ్రీలంక మరియు బాంగ్లాదేశ్ అంతా ఒక్కో మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్ ఓడిపోయారు.

ఐతే సోమవారం భారత్ శ్రీలంక తో జరిగే మ్యాచ్ ను గెలిస్తే ఫైనల్స్ లో స్థానం దాదాపు ఖాయం చేసుకుంటారు. కానీ శ్రీలంక తమ సారధి దినేష్ చండీమల్ లేకుండా ఫైనల్ కు ఎలా చేరతారో చూడాలి.

SHARE