మాజీ పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది, పాకిస్తాన్ క్రికెట్ లీగ్ లో ఆడేందుకు భారత్ క్రికెటర్లను కూడా పిలవాలని తన అభిప్రాయం వ్యక్తం చేసాడు.

లాహోర్ లో జరిగిన ఒక ఫంక్షన్ లో మాట్లాడుతూ భారత్ క్రికెటర్ల కాంట్రాక్టుల పరంగా వారు వేరే దేశాల్లో ఆడే అనుమతి లేనట్టు తనకు తెలుసని చెప్పాడు.

“వారికి కాంట్రాక్టులు ఉన్నపటికీ మన ప్రయత్నం మనం చేయాలి. వారు కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడతారని నాకు తెలుసు. ఐన సరే వచ్చే ఏడాది పి ఎస్ ఎల్ కు వారిని పిలవాలి,” అని ఆఫ్రిది అన్నారు.

ఐతే భారత్ తో 2008 నుండి￶ పూర్తి స్థాయి
సిరీస్ ఆడని పాకిస్తాన్ తో బంధాలు బాగా దెబ్బ తిన్న విషయం అందరికి తెలిసినదే￶￶.

ప్రస్తుతం జరుగుతున్న పి ఎస్ ఎల్ సీజన్ మూడో మ్యాచ్లో గాయపడ్డ షాహిద్ ఆఫ్రిది లేకపోవడంతో అతని జట్టు ఫైనల్ కు చేరుకోలేదు. కానీ పిఎస్ఎల్ లో పెరుగుతున్న విదేశీ ఆటగాళ్ల వాళ్ళ లీగ్ కు మంచి పేరు వస్తుందని అతను తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

“పాకిస్తాన్ క్రికెట్ తీసుకున్న అతి పెద్ద నిర్ణయం. దీనితో ఇప్పుడు చాలా మంది విదేశీ ఆటగాళ్లు పాకిస్తాన్ కు వస్తున్నారు. ఐతే భవిష్యత్తులో కూడా కేవలం ఎవరైతే పాకిస్తాన్ లో ఆడటానికి ఇష్టపడతారో , కేవలం వారిని మాత్రమే బోర్డు ఆహ్వానించాలి,” అని ఆఫ్రిది అన్నాడు.

ఎక్కువ మంది విదేశీ ఆటగాళ్లు పి ఎస్ ఎల్ ద్వారా పాకిస్తాన్ లో ఆడటం వలన అంతర్జాతీయ క్రికెట్ పాకిస్తాన్ కు త్వరగా తిరిగి వస్తుందని ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు.

మార్చ్ 2009 లో శ్రీ లంక క్రికెటర్ల పై జరిగిన మిలిటెంట్ దాడి తరువాత మారె ఇతర టెస్ట్ జట్టు పాకిస్తాన్ లో ఆడేందుకు సుముఖత చూపలేదు. దీనితో పాకిస్తాన్ బోర్డు తమ మ్యాచ్ లను దుబాయ్, అబూ దాబి లాంటి నగరాల్లో నిర్వహిస్తున్నారు.

గత ఏడాది నుండి పాకిస్తాన్ కు మరల క్రికెట్ ను తీసుకువచ్చే ప్రయత్నంలో బోర్డు పి ఎస్ ఎల్ ఫైనల్ ను పాకిస్థాన్లోని లాహోర్ లో నిర్వహిస్తున్నారు.

SHARE