భారత్ తో జరగనున్న ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్ లో కేప్ టౌన్ టెస్టు కు సౌత్ ఆఫ్రికా డేల్ స్టెయిన్ దూరం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

జనవరి 5 న ప్రారంభం కానున్న తొలి టెస్ట్ లో ఆడేందుకు స్టెయిన్ ఫిట్ కావడం కష్టమని తెలుస్తుంది. గాయాల కారణంగా గత ఏడాది కాలం గా క్రికెట్ ఆడని సౌత్ ఆఫ్రికా పేస్ బౌలర్, ఇటీవలే దేశవాళీ టీ 20 టోర్నమెంట్ రామ్ స్లాం లో ఆడాడు.

2016 నవంబర్ లో ఆస్ట్రేలియా పై తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన స్టెయిన్, తొలుత జూన్ కి కోలుకుంటాడు అని అంతా అనుకున్నారు. అయితే అతని గాయం త్వరగా నయం కాకపోవడంతో ఆయన మరింత సమయం తర్వాత మళ్ళీ క్రికెట్ ఆడారు.

PERTH, AUSTRALIA – NOVEMBER 04: Dale Steyn of South Africa walks from the field with the team physio after injuring his shoulder during day two of the First Test match between Australia and South Africa at the WACA on November 4, 2016 in Perth, Australia. (Photo by Paul Kane/Getty Images)

అయితే తర్వాత రామ్ స్లామ్ లో ఆడిన స్టెయిన్, మరి కొన్ని రోజుల తర్వాత దేశవాళీ క్రికెట్ కూడా ఆడారు. జింబాబ్వే పై జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో బౌలింగ్ చేసిన స్టెయిన్, తర్వాత జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ కు మాత్రం దూరం అయ్యారు. కానీ అందరు భారత్ పై జరిగే తొలి టెస్టుకు స్టెయిన్ ఫిట్ అవుతాడు అని ఆశించారు.

కానీ ఇప్పుడు అతను తొలి టెస్టు ఆడే అవకాశం చాలా తక్కువగా ఉంది. అయితే తర్వాత రెండు టెస్టులకు స్టెయిన్ అందుబాటులో ఉండటం ఖాయంగా కనిపిస్తుంది.

ప్రపంచం లోనే అత్యుత్తమ పేస్ బౌలింగ్ కలిగిన సౌత్ ఆఫ్రికా కు స్టెయిన్ దూరం అయినా సరే ఒక తలనొప్పి తగ్గింది. తొలి టెస్టు లో కాగిసో రబడా, వెర్నాన్ ఫిలాండర్ స్ట్రైక్ బౌలర్లు గా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో మూడో పేసర్ స్థానం పై బాగా ఆసక్తి నెలకొనుంది.

ఇప్పుడు స్టెయిన్ తొలి టెస్టు మిస్ అవటంతో మూడో పేసర్ స్థానం లో ఫామ్ లో ఉన్న మోర్నీ మోర్కెల్ పేరు ఖరారు చేయొచ్చు.

SHARE