ఐపీఎల్ 2018 లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుపై విజయంతో రాజస్థాన్ రాయల్స్ బోణీ కొట్టింది. బుధవారం జైపూర్లో సవాయి మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో, వర్షం తన ప్రభావం చూపించింది.

తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్, తొలి అయిదు ఓవర్ల లోపే బెన్ స్ట్రోక్స్ మరియు డార్సీ షార్ట్ ను అవుట్ చేశారు. అయితే తర్వాత బ్యాటింగ్కు వచ్చిన వికెట్కీపర్ బ్యాట్స్మన్ సంజూ శాంసన్ 22 బంతుల్లో 37 పరుగులు చేశాడు. మరోవైపు కెప్టెన్ రహానే ఆచితూచి ఆడుతూ శాంసన్ కు మంచి సహకారం అందించాడు.

దీనితో రాజస్థాన్ రాయల్స్ స్కోరు పరుగులు తీసింది. అయితే ఢిల్లీ స్పిన్నర్ షాదాబ్ నదీమ్ వరుసగా శాంసన్, రహానేలను తన బౌలింగ్లో ఔట్ చేయడంతో ఢిల్లీ జట్టు తిరిగి మ్యాచ్ పై పట్టు సాధించారు.

ఇంగ్లాండ్ బాట్స్మన్ జొస్ బట్లర్ చివరిలో ధాటిగా ఆడటంతో స్కోరు 150 దాటింది. ఢిల్లీ బౌలర్ లలో షాదాబ్‌ నదీమ్‌ రెండు వికెట్లు తీయగా, న్యూజిలాండ్ పేస్ బౌలర్ ట్రెంట్ బోల్ట్ ఒక వికెట్ తీసాడు. భారత్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ కూడా ఒక వికెట్ తీసి మంచి ప్రదర్శనే ఇచ్చాడు.

రెండున్నర గంటల తర్వాత వర్షం నుండి తేరుకొని ఆటను ప్రారంభించారు. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం ఢిల్లీ లక్ష్యాన్ని 6 ఓవర్లలో 71 పరుగులుగా సవరించారు. ఐతే పిచ్‌ బౌలర్లకు అనుకూలంగా మారడం, రాయల్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి మ్యాచ్ ను అలవోకగా గెలిచారు. విధ్వంసక ఆటగాళ్లు మాక్స్‌వెల్‌, రిషబ్‌ పంత్‌ ఆశించిన స్థాయిలో బాటింగ్ చేయకపోవడంతో ఢిల్లీ మ్యాచ్ ను గెలవలేకపోయింది.

SHARE