భారత్ క్రికెట్ జట్టు కోచ్ రవి శాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ ను పొగడ్తలతో ముంచెత్తాడు. సౌత్ ఆఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లీ నేతృత్వంలో అద్భుతంగా రాణించిన భారత్ జట్టు, వన్డే మరియు టీ 20 సిరీస్ లు కైవసం చేసుకున్న విషయం తెలిసినదే.

అయితే రవి శాస్త్రి విరాట్ ను పాకిస్తాన్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ తో పోల్చాడు. గత రెండు సంవత్సరాల్లో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా అందరి మన్ననలు పొందాడు. టెస్టుల్లో మరియు వన్డేల్లో మొదటి స్థానాన్ని తీసుకువెళ్లిన విరాట్ కోహ్లీ, టీ 20 ల్లో కూడా భారత్ రికార్డు ను చాలా మెరుగు పరిచాడు.

కానీ కెప్టెన్సీ బాధ్యతల వలన అతని బాటింగ్ పై ఎటువంటి ప్రభావం పడలేదు. ఒక విధం గా చెప్పాలంటే కెప్టెన్ అయినా తరువాతే అతని బాటింగ్ ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగింది.

“ఇంకా తన కెరీర్ లో ఆరంభ దశలోనే విరాట్ కోహ్లీ ఉన్నాడు. అప్పుడే అతను క్రికెట్ దిగ్గజాల సరసన చేరాడు. అయితే అతను తన జట్టు నడిపించే విధానం చూస్తుంటే నాకు ఇమ్రాన్ ఖాన్ గుర్తొస్తున్నాడు,” అని రవి శాస్త్రి అన్నాడు.

“పరిస్థితులు ఎలాంటివైనా సరే ప్రత్యర్థిపై ఆధిపత్యం సాధించేందుకు తపన పడతాడు విరాట్. అలాంటి స్వభావం ఉన్న క్రికెటర్ డ్రెస్సింగ్ రూమ్ లో ఉంటే అదే భావన అందరిలోకి కలుగుతుంది. ఇది ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ను నడిపిన పద్ధతికి చాలా దగ్గరగా ఉన్న విరాట్ స్వభావం,” అని శాస్త్రి చెప్పాడు.

సౌత్ ఆఫ్రికా పై ఇటీవలే పూర్తి అయినా పర్యటనలో విరాట్ కోహ్లీ, తాను ప్రపంచంలోనే బెస్ట్ బాట్స్మన్ అని మరో సారి నిరూపించాడు. మొత్తం పర్యటన లో అతను 870 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు.

ముఖ్యంగా వన్డే సిరీస్ లో 550 పరుగులు పైబడి చేసి ఒక ద్వైపాక్షిక సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన బాట్స్మన్ అయ్యాడు. కానీ ఈ మార్చ్ 6 నుండి ప్రారంభం కానున్న ముక్కోణపు సిరీస్ కు అతనికి సెలెక్టర్లు విశ్రాంతి కలిపించారు.

SHARE