DURBAN, SOUTH AFRICA - DECEMBER 28: Morne Morkel of South Africa looks frustrated after another dropped catch during day three of the 1st Test between South Africa and England at Sahara Stadium Kingsmead on December 28, 2015 in Durban, South Africa. (Photo by Julian Finney/Getty Images)

తన అంతర్జాతీయ కెరీర్ లో ఆఖరి మ్యాచ్ ఆడిన మోర్నీ మోర్కెల్, కెరీర్ ఉత్తమమైన 800 రేటింగ్ పాయింట్లతో ఆరో స్థానంలో తన అద్భుతమైన కెరీర్ ను ముగించాడు.

ఆస్ట్రేలియా తో జరిగిన టెస్ట్ సిరీస్ లో సౌత్ ఆఫ్రికా 3 -1 తో గెలవడానికి ముఖ్య భూమిక పోషించిన మోర్నీ మోర్కెల్, సిరీస్ లో ఏకంగా 15 వికెట్లు తీసాడు. 1992 లో క్రికెట్లోకి తిరిగి పునర్ప్రవేశం చేసిన తరువాత ఆస్ట్రేలియా పై సొంత గడ్డ లో గెలిచినా తొలి టెస్ట్ సిరీస్ ఇదే కావడం విశేషం.

తాజా గా ప్రకటించిన ర్యాంకుల్లో కాగిసో రబడా ఇంకా తొలి స్థానంలోనే ఉండగా, మరో సౌత్ ఆఫ్రికా పేస్ బౌలర్ వెర్నాన్ ఫిలాండర్ మాత్రం ఏకంగా మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆఖరి టెస్ట్ లో ఆఖరి రోజు బాటింగ్ కు వచ్చిన ఆస్ట్రేలియా వెన్ను విరిచిన ఫిలాండర్, ఏకంగా ఆరు ఓవర్లలో ఆరు వికెట్లు తీసాడు.

కానీ న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో మాన్ అఫ్ ది సిరీస్ అవార్డు గెలిచినా న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బోల్ట్ మాత్రం ఒక స్థానం కోల్పోయి ఎనిమిదో స్థానంలో నిలిచాడు.

నాలుగు టెస్ట్ మ్యాచుల సిరీస్ లో 23 వికెట్లు తీసిన రబడా, తొలి స్థానంలో ఉన్నపటికీ ఐదు పాయింట్లు కోల్పోయి 897 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ రెండో స్థానంలో 891 రేటింగ్ పాయింట్స్ తో ఉండటం గమనార్హం.

భారత్ స్పిన్ ద్వయం రవీంద్ర జడేజా మరియు రవిచంద్రన్ అశ్విన్ నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. 844 రేటింగ్ పాయింట్లతో జడేజా ఉండగా, అశ్విన్ కు 803 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.

ఆస్ట్రేలియా యువ పేస్ బౌలర్ పాట్స్ కమ్మిన్స్ ఆరో స్థానం లో 800 రేటింగ్ పాయింట్లతో ఉండగా, మోర్నీ మోర్కెల్ కూడా అవే రేటింగ్ పాయింట్లతో ఏడో స్థానం దక్కించుకున్నాడు. శ్రీలంక స్పిన్నర్ రంగాన హెరాత్ తొమ్మిదో స్థానంలో ఉండగా, పదో స్థానం లో న్యూజిలాండ్ పేస్ బౌలర్ నిల్ వాగ్నెర్ ఉన్నాడు.

SHARE