ఈ నెల 27 న జరగనున్న ఐపిఎల్ వేలం పాటలో వెటరన్ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ మరియు గౌతమ్ గంభీర్ ఎక్కువ ధర పలకకపోవచ్చు అని కింగ్స్ XI పంజాబ్ కోచ్ వీరేందర్ సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

తననే ఉదాహరణగా తీసుకున్న సెహ్వాగ్, తాను భారత్ జట్టు నుంచి వెలువడిన తరువాత తన ధర బాగా పడిపోయిన విషయం గుర్తుచేశాడు. అయితే ఐపిఎల్ భారత క్రికెటర్లు ఆర్ధికంగా బాగా స్థిర పడడటానికి ఉపయోగపడిందని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

తొలుత ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ప్రాతినిధ్యం వహించిన వీరేందర్ సెహ్వాగ్, 2014 లో కింగ్స్ XI పంజాబ్ జట్టు లో చేరాడు. రెండు సీజన్ లలో ఆడిన తరువాత, అతను అదే జట్టు కు కోచ్ గా మారిన విషయం కూడా తెలిసినదే.

అయితే యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ మరియు గౌతమ్ గంభీర్ ఇటీవలే భారత్ జట్టు లో సరైన స్థానం సంపాదించకపోవడంతో వారి ధర 10 -12 కోట్లు పలకడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేసాడు.

Hyderabad: Yuvraj Singh of Sunrisers Hyderabad celebrates his fifty runs during the first match of IPL 2017 against Royal Challengers Bangalore at the Rajiv Gandhi Stadium in Hyderabad on Wednesday. PTI Photo / SPOTZPICS (PTI4_5_2017_000326B)

కోల్ కతా కింగ్స్ రైడర్స్ తమ కెప్టెన్ అయినా గంభీర్ ను రెటైన్ చేస్కుకోకపోగా, సన్ రైజర్స్ హైదరాబాద్ యువరాజ్ సింగ్ ను రిలీజ్ చేసారు. అయితే తొలి ఐపిఎల్ నుండి ముంబై ఇండియన్స్ జట్టు లోనే ఉన్న హర్భజన్ సింగ్ కూడా మొదటి సీజన్ తర్వాత తొలి సారి ఆక్షన్ లోకి వేళనున్నాడు.

అయితే 2015 లో భారత్ జట్టు నుంచి స్థానం కోల్పోయిన యువరాజ్ సింగ్ ను 16 కోట్లు పెట్టి ఢిల్లీ డేర్ డెవిల్స్ కొనుకున్నప్పటికీ, ఈ సారి ఈ భారత్ దిగ్గజ త్రయం 35 పైబడిన వయసు ఉండటంతో అంత ఆకర్షణ గా నిలవలేకపోవచ్చు.

11 వ సీజన్ ఐపిఎల్ కు ఈ నెల 27, 28 న బెంగళూరులో ఆక్షన్ జరగనుంది. అయితే ఇప్పటికే తమకు నచ్చిన ఆటగాళ్లను రెటైన్ చేసుకున్న ఫ్రాంచైజీలు, రైట్ టూ మ్యాచ్ కార్డు కూడా వాడుకుని ఆక్షన్ సమయం లో మరో సారి వారి ఆటగాళ్లను రెటైన్ చేసుకొనే అవకాశం కల్పించింది ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్.

SHARE