ఐపిఎల్ 2018 కి ఫ్రాంచైజీలు ప్లేయర్ రేటెన్షన్ ఆఖరి తేదీ జనవరి 4 కావడం తో, మొత్తం 8 ఫ్రాంచైజీలు తాము రెటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను బిసిసిఐ కు అందిచాయి.

రాబోయే ఐపిఎల్ కు ఒక్కో ఫ్రాంచైజ్ అత్యధికంగా 3 ఆటగాళ్లను రెటైన్ చేసుకొనే అవకాశం బిసిసిఐ కల్పించగా, 4 ఫ్రాంచైజీలు ఇచ్చిన కోటాను వాడుకున్నాయి. తిరిగి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, ఢిల్లీ డేర్ డెవిల్స్, ముంబై ఇండియన్స్ అంత ముగ్గుర్ని రెటైన్ చేసుకున్నాయి.

ఐతే సన్ రైజర్స్ హైదరాబాద్ ఇద్దరిని రెటైన్ చేసుకోగా, కోల్ కతా నైట్ రైడర్స్ కూడా వారి బాటలోనే రెండు ఆటగాళ్లను రెటైన్ చేసుకున్నారు. మరల పునర్ ప్రవేశం చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ ఒక ఆటగాడిని రెటైన్ చేసుకోగా, కింగ్స్ XI పంజాబ్ కూడా ఒక ఆటగాడిని రెటైన్ రెటైన్ చేస్కోవడం గమనార్హం.

చెన్నై సూపర్ కింగ్స్ భారత్ జట్టు ఆటగాళ్లు ఎం ఎస్ ధోని, సురేష్ రైనా మరియు రవీంద్ర జడేజా ను రెటైన్ చేసుకున్నారు. అయితే వారికి సమఉజ్జి అయినా ముంబై ఇండియన్స్ కూడా రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా మరియు హార్దిక్ పాండ్య ను రెటైన్ చేసుకున్నారు.

ఐపిఎల్ అత్యంత ఫాన్స్ కలిగిన జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కూడా విరాట్ కోహ్లీ, ఏ బి డివిల్లియర్స్ మరియు సర్ఫరాజ్ ఖాన్ ను వారి జాబితాలో ప్రకటించారు. అయితే మంచి యువ ఆటగాళ్లు ఉన్న ఢిల్లీ డేర్ డెవిల్స్ శ్రేయాస్ ఐయార్, రిషబ్ పంత్ మరియు క్రిస్ మోరిస్ ను జట్టులోకి రెటైన్ చేసుకున్నారు.

సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరియు భారత్ అగ్ర బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను ఎంపిక చేసుకోగా, శిఖర్ ధావన్ ను వదిలేయడం గమనార్హం. కోల్ కతా కింగ్స్ రైడర్స్ అందరికంటే బిన్నంగా మరో సారి కేవలం అంతర్జాతీయ ఆటగాళ్ళని రెటైన్ చేసుకున్నారు.

వారు రెటైన్ చేసుకున్నది కేవలం సునీల్ నరైన్, అండ్రే రస్సెల్ ను మాత్రమే. ఐతే వారు వేలం లో ఎలా జట్టును కూర్పు చేస్తారో చూడాలి. మరో వైపు బాన్ నుంచి బయటకు వచ్చిన రాజస్థాన్ రాయల్స్ కేవలం స్టీవ్ స్మిత్ ను రెటైన్ చేసుకున్నారు. సెహ్వాగ్ కోచ్ గా ఉన్న కింగ్స్ XI పంజాబ్ భారత్ స్పిన్నర్ అక్షర్ పటేల్ ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు.