ఫిబ్రవరి లో సౌత్ ఆఫ్రికా పర్యటన లో భారత్ ఆడే వన్ డే సిరీస్ కు సెలక్షన్ కమిటీ ఈ రోజు తుది జట్టు ను ప్రకటించింది. ఎం ఎస్ కే ప్రసాద్ నాయకత్వంలో ఉన్న సెలెక్టర్లు శ్రీలంక సిరీస్ ను గాయం తో ఆడని కేదార్ జాదవ్ ను తుది జట్టు లో చేర్చారు.

Pune: India’s Kedar Jadhav celebrates his century during the first India-England ODI at MCA stadium in Pune on Sunday. PTI Photo by Mitesh Bhuvad(PTI1_15_2017_000226b)

మొత్తం 17 మంది తో కూడిన జట్టు ను ప్రకటించిన సెలెక్టర్లు, ఎం ఎస్ ధోని మరియు హార్దిక్ పాండ్య తో కలిపి మొత్తం 10 మంది బ్యాట్స్ మాన్ ను సౌత్ ఆఫ్రికా పర్యటన కు ఎంపిక చేసారు.

శ్రీలంక సిరీస్ లో ఆడని ముంబై బౌలర్ శార్దూల్ ఠాకూర్ వైపు సెలెక్టర్లు మరల మొగ్గు చూపారు. అయితే స్టార్ పేస్ బౌలర్ ఉమేష్ యాదవ్ కు మొండి చేయి చూపించగా, మరో కీలక బౌలర్ మహమ్మద్ షమీ కు సెలెక్టర్లు చోటు కల్పించారు.

శ్రీలంక పై ప్రస్తుతం జరుగుతున్న టీ 20 సిరీస్ లో చక్కటి ప్రదర్శన చూపిస్తున్న కే ఎల్ రాహుల్ ను మరో సారి పక్కన పెట్టగా, ఇటీవలే యో-యో టెస్ట్ లో పాస్ అయినా యువరాజ్ సింగ్, సురేష్ రైనా కూడా మరో సారి టీం లోకి రాలేకపోయారు.

ఇటీవలే జట్టు లో చక్కటి ప్రదర్శనలు చూపిస్తున్న శ్రేయాస్ ఐయార్ ను మరో సారి సెలెక్టర్లు తమ మద్దతు తెలిపారు. అయితే ఈ సిరీస్, యువ శ్రేయాస్ ఎదుగుదలకు చక్కటి అవకాశం అవుతుంది.

అల్ రౌండర్స్ కోటాలో హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ కు అవకాశం దక్కగా, పేస్ బౌలింగ్ విభాగం లో భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, షమీ మరియు ఠాకూర్ ను ఎంపిక చేసారు.

రెండు స్పిన్నర్ల స్థానం లో మంచి ఫామ్ కనబరుస్తున్న కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ ను ఎంపిక చేసారు. అయితే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మరో సారి వన్ డే జట్టు లో స్థానం సంపాదించలేకపోవడం గమనార్హం.

తుది భారత్ జట్టు: విరాట్ కోహ్లీ (c), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అజింక్య రహానే, శేయ్యాస్ అయ్యర్, మనీష్ పాండే, కేదార్ జాధవ్, దినేష్ కార్తీక్, ధోనీ (wk), హరిక్ పాండ్య, ఆక్సార్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్, జాస్ప్రిత్ బుమ్రా, మొహమ్మద్ షామి, శార్తుల్ ఠాకూర్

SHARE