కింగ్స్ XI పంజాబ్ స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2018 కోసం సంసిద్ధం అవుతున్నాడు.అతను ఇటీవలే జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో కేవలం ముప్పై అయిదు బంతుల్లో నూట ఇరవైదు పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

గత ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన యువరాజ్ సింగ్ ఈ ఏడాది ఆక్షన్లో కేవలం రెండు కోట్ల ధరకే కింగ్స్ XI పంజాబ్ జట్టులో చేరాడు.అతను ఈ మ్యాచ్లో పన్నెండు సిక్సులు సాధించగా, మరో భారత బ్యాట్స్మన్ అయినా కేఎల్ రాహుల్ విజయవంతమైన ఎనభై అయిదు పరుగులు సాధించాడు.

గత పదేళ్లుగా పెద్దగా రాణించలేని పంజాబ్ జట్టు, ఈసారి వీరేంద్ర సేహ్వాగ్ నేతృత్వంలో మంచి జట్టును సాధించింది. క్రిస్ గేల్, మయంక్ అగర్వాల్, యువరాజ్ సింగ్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, అక్సర్ పటేల్ వంటి మంచి ఆటగాళ్లను ఆ జట్టు సొంతం చేసుకుంది.

India’s Ravichandran Ashwin(R)celebrates with teammate Vuvraj Singh after his dismissal of Australia’s David Warner during the World T20 cricket tournament match between India and Australia at The Punjab Cricket Stadium Association Stadium in Mohali on March 27, 2016. / AFP / MONEY SHARMA (Photo credit should read MONEY SHARMA/AFP/Getty Images)

గత ఏడాది భారత జట్టు నుంచి స్థానం కోల్పోయిన యువరాజ్ సింగ్ ఈ ఏడాది ఎలా అయినా సరే ఐపీఎల్లో చక్కగా రాణించి భారత సీనియర్ జట్టులో ఎలాగైనా స్థానం సంపాదించాలని మంచి పట్టుదల మీద ఉన్నాడు.

అతను ప్రాక్టీస్ మ్యాచ్లో ఆడిన విధానం చూస్తుంటే ఈ ఐపీఎల్లో మరోసారి పూర్వం మంచి ఫామ్లో ఉన్న యువరాజ్ సింగ్ ను మరోసారి చూసే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి. పంజాబ్ జట్టులో ఈ ఏడాది జరిగే ఐపీఎల్ కు యువరాజ్ సింగ్ మిడిల్ ఆర్డర్లో చాలా ముఖ్య భూమిక పోషించాల్సి ఉంది.

అతను గానీ బాగా రాణిస్తే వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్పు కూడా స్థానం చేజిక్కించుకొనే అవకాశాలు మెండుగా ఉంటాయి.యువరాజ్ సింగ్ ఆడిన అత్యద్భుత ఇన్నింగ్స్ మీరే చూడండి

రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్ గా బరిలోకి దిగుతున్న పంజాబ్ జట్టు, కనీసం ప్లే ఆఫ్ లకు కూడా క్వాలిఫై అవ్వకపోతే ఈ ఏడాది కూడా నిరాశపరిచినట్టే.

SHARE