ఈ ఏడాది ఐపీఎల్ ను గెలవాలంటే చిన్న చిన్న విషయాలపై దృష్టి సారించాలి అని సన్ రైజర్స్ హైదరాబాద్ వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ అభిప్రాయపడ్డాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్లో డేవిడ్ వార్నర్ లేకపోవడం హైదరాబాద్ జట్టుకు సీజన్ ప్రారంభం కాకముందే పెను దెబ్బగా చెప్పవచ్చు.

దక్షిణాఫ్రికాపై జరిగిన మూడో టెస్టులో బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న డేవిడ్ వార్నర్, తర్వాత నిందితుడిగా తేలడంతో అతనిపై పన్నెండు నెలల పాటు వేటను విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు. అయితే బిసిసిఐ కూడా అదే మార్గంలో వెళ్లడంతో అతను ఈ ఏడాది ఐపీఎల్ నుండి కూడా వేటుకు గురి అయ్యాడు.

అయితే డేవిడ్ వార్నర్ లేనప్పటికీ అతని స్థానంలో ఇంగ్లాండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకున్నారు. సీజన్కు ముందు మీడియాతో మాట్లాడుతూ భువనేశ్వర్ కుమార్, “ఈ ఏడాది మా ధ్యేయం ఐపీఎల్ ను గెలవడమే, కానీ అది అంత సులభం కాదు ఎందుకంటే అన్ని జట్లు చాలా చక్కగా ఉన్నాయి. అందుకే మేము అన్ని విషయాలు మొత్తం అన్ని ఐపిఎల్ మ్యాచ్ లలో సరిగ్గా చేస్తేనే చాంపియన్లు అవుతాం,” అని అన్నాడు.

అయితే ఐపీఎల్ గెలవడానికి ఏమైనా ప్రత్యేక స్ట్రాటజీ అవసరమా అని అడుగగా, భువనేశ్వర్ కుమార్: “స్పెషల్ స్ట్రాటజీ అంటూ ఏమీ ఉండదు. మ్యాచ్ జరిగే ముందు సాయంత్రం టీం మీటింగ్ ఉంటుంది అందులోనే అన్ని రకాల ప్లాన్స్ జట్లు వేసుకుంటాయి,” అని అన్నాడు.

గత రెండు సీజన్లలో పర్ పిల్ క్యాప్ సాధించిన భువనేశ్వర్ కుమార్ ఈ ఏడాది కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ విజయ అవకాశాల్లో కీలక పాత్ర పోషించనున్నాడు. రషీద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్, భువనేశ్వర్ కుమార్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ చాలా గట్టిగా ఉంది.

జట్టులో వార్నర్ లేనప్పటికీ శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, యూసఫ్ పఠాన్, వృద్ధిమాన్ సాహా లాంటి మంచి బ్యాట్స్మెన్ ఉండడం జట్టుకు కలిసొచ్చే అంశం. బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ జట్టులో ఉండనే ఉన్నాడు. దీనితో వార్నర్ లేనప్పటికీ పటిష్టమైన జట్టుతో కూడి ఉన్నది సన్ రైజర్స్ హైదరాబాద్

SHARE