రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్  కోహ్లీ కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాట్ తో మరియు ఫీల్డింగ్ లో కూడా సంచలమైన ప్రదర్శన చేశాడు.

ఇదే అతను అంత మంచి ప్రదర్శన చేసినప్పటికీ, కీలకమైన మ్యాచ్లో తన జట్టు విజయం సాధించలేకపోయింది. అయితే నైట్ రైడర్స్ పై చవి చూసిన పరాజయం తరువాత రాయల్ చారెంజర్స్ ఇక ముందు జరగనున్న ఏడు మ్యాచ్ లలో ఆరు మ్యాచ్లు గెలవాల్సి ఉంది.

ఇప్పటి వరకు కేవలం రెండు మ్యాచ్లు గెలిచిన రాయల్ చాలెంజర్ బెంగళూరు, రెండవ భాగంలో అంచనాలకు మించి రాణించాల్సి ఉంది. పాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా నైట్ రైడర్స్, బెంగళూరు ఓపెనర్లను బాగానే కట్టడి చేశారు.

బ్రెండన్ మెక్కలం మరియు క్వింటన్ డి కాక్ పవర్ప్లే ఓవర్లలో ఎటువంటి ప్రభావం చూపలేకపోయారు. అయితే తర్వాత బ్యాటింగ్కు వచ్చిన విరాట్ కోహ్లీ తొలుత ఆచితూచి అటుగా చివరిలో చాలా వేగంగా పరుగులు సాధించాడు.

కేవలం 44 బంతుల్లో 68 పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ, తన ఇన్నింగ్స్ లో 3 సిక్సులు మరియు 5 ఫోర్లు బాదాడు. దీనితో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేశారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.

రెండవ ఇన్నింగ్స్లో కోల్ కతా నైట్ రైడర్స్ ఆరంభం నుండి తమ ఆధిపత్యం కనబరిచారు. ఓపెనర్లు సునీల్ నరైన్ మరియు క్రిస్ లిన్, చాలా తెలివిగా పరుగులు సాధిస్తూ తమ జట్టుపై ఎటువంటి ఒత్తిడి లేకుండా స్కోరును కదిలించారు. తర్వాత వచ్చిన రాబిన్ ఉతప్ప కూడా వేగంగా పరుగులు చేయడంతో వారి పని మరింత సులువయ్యింది.

చివరిలో బెంగళూరు బౌలర్లు చక్కగా బౌలింగ్ చేసి మ్యాచ్ను ఉత్కంఠ భరితంగా చేసినప్పటికీ, కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తిక్ చాలా వేగంగా ఇరవై మూడు పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

అయితే విరాట్ కోహ్లీ అతని వికెట్ తీయడానికి పట్టిన క్యాచ్, అభిమానుల దృష్టిని ఆకర్షించింది. మంచి ఫామ్లో ఉన్న దినేశ్ కార్తిక్ లాంగ్ ఆ దిశగా షాట్ ను ప్రయత్నించగా, అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ సంచలన క్యాచ్ పట్టాడు.

ఈ ఐపీఎల్ సీజన్లో అత్యద్భుతమైన క్యాచ్ల్లో ట్రెంట్ బౌల్ట్ స్క్వేర్లెగ్ దగ్గర పట్టిన క్యాచ్ ఒకటి అవ్వగా, ఇప్పుడు విరాట్ కోహ్లీ పట్టిన క్యాచ్ దాని సరసన చేరింది.

విరాట్ కోహ్లీ క్యాచ్ ను మీరే చూడండి