ఈడెన్ గార్డెన్స్ లో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడుతుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణయం సరైనదే అని నీరు నిరూపణ చేస్తూ పియూష్ చావ్లా రెండవ ఓవర్లో క్వింటన్ డి కాక్ వికెట్లను తీశాడు.

అయితే తరువాత బ్రెండన్ మెక్కలం విరాట్ కోహ్లీ చక్కటి పార్ట్నర్ షిప్ నెలకొల్పి, రాయల్ చాలెంజర్స్ బెంగళూరును మంచి స్థితికి తీసుకువెళ్లారు. మెక్కలం అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్ ఎప్పటిలానే తన అద్భుతమైన పవర్ హిట్టింగ్ ను ఈడెన్ గార్డెన్స్‌లో ఉన్న ప్రేక్షకులకు చూపించాడు.

అయితే కోల్కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తిక్, ఒక ఓవర్ యువ ఆటగాడు నితీశ్ రాణాకు ఇవ్వడం మ్యాచ్ ను వారివైపు తిరిగేలా చేసింది. బౌలింగ్‌కు వచ్చిన నితీష్ రాణా తన తొలి బంతికి సిక్స్ కు తరలించినప్పటికీ, అతను తర్వాత బంతికి ఏబీ డివిలియర్స్‌ను ఔట్ చేశాడు.

అయితే ఏబి డివిలియర్స్ ను అవుట్ చేసిన తరువాత మరో బంతికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఔట్ చేసి సంచలనమే సృష్టించాడు. అయితే కోహ్లీ వికెట్ తీసిన వెంటనే నితీశ్ రానా చాలా దూకుడుగా సంబరాలు చేసుకోవడం గమనార్హం.

అతను ప్రపంచంలో ఉన్న టాప్ రెండు బ్యాట్స్ మెన్ ను అవుట్ చేయడంతో అతన్ని ఎమోషన్స్ ను అదుపులో ఉంచుకోలేక పోయాడు. అయితే విరాట్ కోహ్లీ ను బౌల్డ్ చేసిన తరువాత, అతను కోహ్లీను తిట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది.

నితీశ్ రాణా దూకుడు సంబరాలు మీరే చూడండి

SHARE