Hyderabad: Yuvraj Singh of Sunrisers Hyderabad celebrates his fifty runs during the first match of IPL 2017 against Royal Challengers Bangalore at the Rajiv Gandhi Stadium in Hyderabad on Wednesday. PTI Photo / SPOTZPICS (PTI4_5_2017_000326B)

కింగ్స్ XI పంజాబ్ మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్, భారత్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను వచ్చే సీజన్ కు కెప్టెన్ గా ప్రకటించి చాలా మంది అభిమానులను ఆశ్చర్యపరిచాడు. కానీ ఈ నిర్ణయానికి కారణం తన ఫ్రాంచైజ్ దీర్ఘకాలిక ఆలోచన చేయటం వలనే అశ్విన్ కు మొగ్గు చూపినట్టు సెహ్వాగ్ చెప్పారు.

పంజాబ్ అభిమానులు అందరు యువరాజ్ సింగ్ ను కెప్టెన్ గా చూడాలనుకున్న, టీమ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని టీమ్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఒక ఐపీఎల్ ట్రోఫీ కూడా గెలవని పంజాబ్ జట్టు, ఈ సారి ఎలాగైనా సరే మంచి ప్రదర్శన చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

India’s Ravichandran Ashwin(R)celebrates with teammate Vuvraj Singh after his dismissal of Australia’s David Warner during the World T20 cricket tournament match between India and Australia at The Punjab Cricket Stadium Association Stadium in Mohali on March 27, 2016. / AFP / MONEY SHARMA (Photo credit should read MONEY SHARMA/AFP/Getty Images)

ఫేస్ బుక్ లో లైవ్ సెషన్ లో అభిమానులు ముందుకు వచ్చిన వీరేంద్ర సెహ్వాగ్, అశ్విన్ ను నూతన కెప్టెన్ గా వెల్లడించాడు. తరువాత అశ్విన్ తో కలిసి ఫాన్స్ తో మాట్లాడిన వీరు, సపోర్ట్ స్టాఫ్ మరియు ఓనర్లు అశ్విన్ వైపే వోట్ వేసినట్టు చెప్పాడు.

“మన ఫాన్స్ లో 90 శాతం మంది యువరాజ్ సింగ్ నే కెప్టెన్ గా చూడాలి అనుకున్నారు. అయితే నేను వేరే కోణంలో చూశాను. ఎప్పుడు ఒక బౌలర్ ను కెప్టెన్ చేస్తే బాగుండేంది అని వసీం అక్రమ్, వాకర్ యూనిస్ లాంటి వారిని చూస్తే అనిపించేది,” అని అన్నాడు.

Ravichandran Ashwin of Rising Pune Supergiants celebrates getting David Miller of Kings XI Punjab wicket during match 53 of the Vivo IPL 2016 (Indian Premier League) between Rising Pune Supergiants and the Kings XI Punjab held at the ACA-VDCA Stadium, Visakhapatnam on the 21st May 2016
Photo by Shaun Roy / IPL/ SPORTZPICS

అయితే యువరాజ్ సింగ్ తనకు చాలా ఆప్తమైన స్నేహితుడని, కానీ ఫ్రాంచైజ్ దీర్ఘకాలిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అతన్ని కెప్టెన్ చేయలేదు అని చెప్పారు.

అశ్విన్ ను రాబోయే మూడు నాలుగు సంవత్సరాలు కెప్టెన్ గా చూడాలి అనే ఆలోచనతో కెప్టెన్ గా చేసాము అని చెప్పిన సెహ్వాగ్, వచ్చే సీజన్ లో టీమ్ ప్రదర్శన బట్టి ఈ విషయం ఆధారపడి ఉంటుంది అని అన్నాడు.

2008 లో పంజాబ్ జట్టుతో తన ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన యువరాజ్ సింగ్, తొలి సీజన్ లో కెప్టెన్ గా వారిని సెమి ఫైనల్స్ వరకు తీసుకువెళ్లాడు. రెండో సీజన్ లో ఐదో స్థానంలో నిలిచినా పంజాబ్ జట్టు తరువాత పెద్ద గొప్ప ప్రదర్శనలు చెయ్యలేదు.

అయితే ఈ సారి మరల యువరాజ్ సింగ్ తన సొంత జట్టుకు ఆడటంతో అభిమానుల్లో కింగ్స్ XI పంజాబ్ పై ద్రుష్టి పడింది. అయితే వారు ఎంత వరకు రాణిస్తారు అనేది కాలమే చెప్తుంది.