ఐపీఎల్‌లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ముంబై వర్సెస్ బెంగళూరు మ్యాచ్‌లో 46 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ గెలుపు సాధించింది. ఈ క్రమంలో తమ జట్టు పోరాడి ఓడినట్లు తెలిపాడు బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టు అదిరపోయే స్టార్టింగ్‌ను అందుకుంది.

‘‘తొలి రెండు బంతులకే రెండు వికెట్లు పడగొట్టి ముంబై జట్టును కష్టాల్లోకి నెట్టేశారు బెంగళూరు బౌలర్లు. అయితే ఈ జోరును కొనసాగించడంలో వారు విఫలం కావడంతో ముంబై ఇండియన్స్ పరుగులు సాధించారు. మా బౌలర్లు అటాకింగ్ చేసే విధంగా బౌలింగ్ చేసినప్పటికీ ముంబై బ్యాట్స్‌మెన్ కౌంటర్ అటాక్ చేసి పరుగులు సాధించారు. వారి జట్టులో రోహిత్ శర్మ బాగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.’’ అని విరాట్ కోహ్లీ చెప్పాడు.

తమ జట్టు బ్యాట్స్‌మెన్ ఔట్ అయిన విధానాన్ని సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తామని కోహ్లి చెప్పాడు. ఏదిఏమైనా జట్టుకు కావాల్సిన పరుగులను సాధించడంలో తమ జట్టు సక్సెస్ కాలేకపోయిందని కోహ్లి చెప్పాడు. రన్‌రేట్‌ను తగ్గకుండా చూసుకునేందుకు తాము ప్రయత్నించినా ముంబై బౌలర్లు మంచి బౌలింగ్‌ చేసి వికెట్లు సాధించారు. ఇక మ్యాచ్‌ను గెలిపించే ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ ఆడాడని విరాట్ కొనియాడాడు.

అవసరమైనప్పుడు వికెట్లు తీయడంలో తాము ఫెయిల్ అయ్యామని అన్నాడు విరాట్. తమ జట్టు బాగా ఆడినప్పటికీ విజయం మాత్రం దక్కలేదని వాపోయాడు విరాట్. తదుపర మ్యాచ్‌లలో ఎలాంటి నిరుత్సాహం లేకుండా విజయం కోసమే తమ జట్టు ప్రయత్నిస్తుందని విరాట్ కోహ్లి చెప్పాడు. తాను ఆడిన 92 పరుగులు నాటౌట్ ఇన్నింగ్స్ తమ జట్టుకు ఉపయోగపడినందుకు సంతోషం వ్యక్తం చేశాడు కోహ్లి.

SHARE