Credits: BCCI

ఢిల్లీ డేర్ డెవిల్స్ పై ఏడు వికెట్ల తేడాతో ముఖ్యమైన విజయం సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ విజయంతో ప్లే ఆఫ్ దశకు చేరుకునేందుకు మరింత దగ్గర అయ్యారు సన్ రైజర్స్.

టాస్ గెలిచి బాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్, ఆదిలో గ్లెన్ మాక్స్ వెల్ వికెట్ కోల్పోయినప్పటికీ మంచి ఆరంభాన్నే అందుకున్నారు. రెండో వికెట్ కు యువ క్రికెటర్ ప్రిథ్వి షా, కెప్టెన్ శ్రేయాస్ ఐయర్ 86 పరుగులు జోడించి జట్టును మంచి స్థితిలో నిలిపారు. తొలి పది ఓవర్లలో 95 పరుగులు సాధించి పైచేయి సాధించారు.

Credits: BCCI

ఐతే కేవలం 36 బంతుల్లో 65 పరుగులు సాధించిన షా, అవుట్ అయినా తరువాత ఢిల్లీ జట్టు ఆట పై పట్టును కోల్పోయారు. శ్రేయాస్ ఇయర్ మరియు రిషబ్ పంత్ అనుకున్న రీతిలో రాణించలేకపోవడం. పిచ్ కూడా బాగా మెల్లగా అవ్వడంతో పరుగులు సాధించడం కష్టమైంది. కానీ చివరి ఓవర్లో అల్ రౌండర్ విజయ్ శంకర్ వేగంగా పరుగులు చేయడంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 163 పరుగులు చేసారు.

సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్ మరో సారి తన సత్తా చాటాడు. అతను వేసిన 4 ఓవర్లలో కేవలం 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. మిగిలిన బౌలర్లు పర్వాలేదు అనిపించుకున్నారు.

164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కు శిఖర్ ధావన్, అలెక్ హేల్స్ మంచి ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా హేల్స్ తన సత్తా చాటి, పవర్ ప్లే ఓవర్లలో ఢిల్లీ బౌలర్లను చక్కగా ఆడి వేగంగా పరుగులు సాధించాడు.

కానీ వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్ర మరో సారి తన మాయాజాలం చూపి ధావన్, హేల్స్ ఇద్దరినీ అవుట్ చేసాడు. క్రీజ్ లోకి కొత్తగా వచ్చిన కెన్ విల్లియంసన్, మనీష్ పండేయ్ ఇద్దరు వేగంగా పరుగులు చేయలేకపోయారు. పరుగుల వేగం పెంచే క్రమంలో పండేయ్ అవుట్ అయ్యాడు.

Credits: BCCI

బరిలోకి దిగిన యూసుఫ్ పఠాన్, తన హార్డ్ హిట్టింగ్ ను ఢిల్లీ బౌలర్లకు చూపాడు. సన్ రైజర్స్ ఓడిపోయే సమయంలో బాటింగ్ కు వచ్చిన యూసుఫ్ పఠాన్, బంతి అన్ని వైపులా బాదాడు. చివరిలో ట్రెంట్ బోల్ట్ ఓవర్లో సిక్స్, ఫోర్ అతను సాధించడంతో మ్యాచ్ సన్ రైజర్స్ వైపు మొగ్గింది.

SHARE