ఐపీఎల్ 2018 లో సంచలన ఫాంలో ఉన్న మూడు జట్లు చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ సీజన్ సగం పూర్తవుతున్నా సమయానికి ఈ మూడు జట్లు ప్లే ఆఫ్ దిశగా పయనిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే పంజాబ్ మరియు హైదరాబాద్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో మంచి ఆసక్తి ఉంది.

పిచ్ రిపోర్టు

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం భారత దేశంలోనే అత్యుత్తమ బ్యాటింగ్ వికెట్లలో ఒకటి. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నా మంచి బౌలర్ల కారణంగా ఈ వేదికపై ఎక్కువ పరుగులు చేయడం వేరే ఫ్రాంచైస్ జట్లకు కష్టమే.

మరోసారి మంచి బ్యాటింగ్ కు అనుకూలమైన వికెట్టు ఈ మ్యాచ్‌లో ఉంటుంది. పంజాబ్ బ్యాటింగ్ కు మంచి ప్రసిద్ధి చెందగా సన్ రైజర్స్ బౌలింగ్ లో ఆరితేరి అన్నారు. ఈ రెండు జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌లో బ్యాట్ గెలుస్తుందా లేక బాల్ గెలుస్తుందా అన్నది మనం వేచి చూడాలి.

టాస్ గెలిస్తే?

టాస్ గెలిచిన కాప్టన్ తొలుత బౌలింగ్ చేయడానికి కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ గ్రౌండ్లో సాధారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు ఎక్కువగా గెలుస్తూ ఉండటంతో, తొలుత బౌలింగ్ చేయడానికి ఇండెంట్లు బాగా మక్కువ చూపుతాయి.

అయితే రెండో ఇన్నింగ్స్‌లో కూడా పిచ్‌లో మార్పులు పెద్దగా లేకపోవడం వలన టాస్ పెద్ద ప్రభావం చూపించకపోవచ్చు.

హెడ్ టు హెడ్ రికార్డు

ఇటీవలే మొహాలీలో జరిగిన మ్యాచ్ లో కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టులో భారీ తేడాతో పరాజయం సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్, మొత్తం 11 మ్యాచ్ లలో 8 విజయాలు సాధించింది.

అయితే ఉప్పల్ స్టేడియంలో జరిగిన 5 మ్యాచ్ లలో  4 విజయాలు సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్, ఈ మ్యాచ్ కూడా గెలవాలని పట్టుదలతో ఉంది.

కీలక ఆటగాళ్లు

ఈ ఏడాది ఐపీఎల్ లో అత్యుత్తమ బ్యాటింగ్ కలిగిన జట్లలో ఒకటైన కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు, బౌలింగ్‌లో మాత్రం కాస్త వెనుకబడి ఉంది. కానీ యువ అఫ్ఘాన్ స్పిన్నర్ ముజీబ్ రెహమాన్ తనదైన శైలిలో ఆడుతూ జట్టును కీలక వికెట్లు.

వికెట్ లో తీసుకోలేని సమయంలో పెద్దగా పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయడంతో పంజాబ్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇటీవలే ముంబై ఇండియన్స్ పై సంచలన విజయం సాధించింది. కేవలం 118 పరుగులు చేసిన హైదరాబాద్ జట్టును బౌలర్లు మరోసారి కాపాడి ముఖ్యమైన విజయం సాధించిపెట్టారు. అయితే పంజాబ్‌పై జరిగే మ్యాచ్ లో మరోసారి రషీద్ ఖాన్ ముఖ్యమైన ఆటగాడిగా బరిలోకి దిగుతాడు.

ముంబాయి పై మంచి ఫామ్ కనబరిచిన రషీద్ ఖాన్ పంజాబ్ పై కూడా అదే ఫామ్‌ను కనబరిచి మరో విజయం సాధించేందుకు పట్టుదలతో ఉన్నాడు.

మ్యాచ్ అంచనా

కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు మంచి ఫాంలో ఉంది. అయితే సన్ రైజర్స్ ను హైదరాబాద్ లో ఓడించడం అసాధారణమైన విషయం. సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపిఎల్ జట్లలోని చాలా ముందుంటుంది.

కానీ భువనేశ్వర్ కుమార్ అందుబాటులో లేకపోవటంతో బౌలర్లు మరోసారి కీలక పాత్ర వహించాల్సి ఉంటుంది.

SHARE