ఐపీఎల్ 2018 లో మిశ్రమమైన ఫలితాలు సాధించిన జట్లలో రాజస్థాన్ రాయల్స్ ఒకటి. ఇప్పటివరకు వారు ఆడిన 10 మ్యాచ్ లలో 4 విజయాలు సాధించిన రాజస్థాన్ జట్టు, ఇకపై ఆడనున్న చివరి నాలుగు మ్యాచ్ల్లో ఖచ్చితంగా విజయం సాధించాల్సి ఉంది.

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ సంచలనమైన ఫామ్ ను కనబరుస్తూ ప్లే ఆఫ్ దశకు చాలా దగ్గరగా ఉంది. ఈ మ్యాచ్ లో గాని వారు విజయం సాధించగలిగితే కచ్చితంగా ప్లే ఆఫ్ దశకు చేరుకుంటారు.

పిచ్ రిపోర్టు

సవాయి మాన్ సింగ్ స్టేడియంలో ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లలో బ్యాట్స్మన్ పైచేయి సాధించారు. ఈ సారి కూడా పిచ్ బ్యాట్స్మన్కు అనుకూలంగా ఉండనుంది.

వాతావరణం కూడా వేడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలపడంతో బౌలర్లకు స్వింగ్ కూడా పెద్దగా లభించే అవకాశాలు లేవు.

టాస్ గెలిస్తే?

టాస్ గెలిచిన కెప్టెన్ తొలుత బౌలింగ్ చేయడానికి ఇష్టపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మ్యాచ్ జరిగినంత సమయం పిచ్ పెద్దగా మారక పోవటమే ఇందుకు ప్రధాన కారణం.

ఇటీవలే కాలం లో టీ 20 క్రికెట్ లో టాస్ గెలిస్తే బౌలింగ్ చేయటానికే కెప్టెన్లు ఇష్టపడుతున్నారు. అందులోను రెండో ఇన్నింగ్స్ లో బాటింగ్ చేసిన జట్లే ఎక్కువ శాతం మ్యాచ్ లలో విజయాలు సాధించడం గమనార్హం.

హెడ్ టు హెడ్ రికార్డ్

ఇప్పటివరకు ఈ ఇరుజట్లు 18 సార్లు ఐపీఎల్ చరిత్రలో తలపడ్డాయి. అయితే ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ ఏకగ్రీవంగా 12 విజయాలతో తమ సత్తా చాటగా, రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఆరు విజయాలు మాత్రమే సాధించింది.

రాజస్థాన్ జట్టుకు కంచుకోటగా పేరొందిన సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో, నాలుగు మ్యాచ్లలో చెన్నై సూపర్ కింగ్స్ రెండు విజయాలు సాధించడం విశేషం.

కీలక ఆటగాళ్లు

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సంచలనమైన ఫాం కనబరచడానికి ముఖ్య కారణం అంబటి రాయుడు. ఒకవైపు టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ మిశ్రమంగా రాణిస్తున్నప్పటికీ అంబటి రాయుడు మాత్రం ఒకే రీతిలో జట్టుకు అవసరమైన కీలక పరుగులు సాధిస్తూ వారి సీజన్లో ఇప్పటివరకు కీలక పాత్ర పోషించాడు.

అయితే సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో విజయం సాధించాలి అంటే చెన్నైకు మరోసారి రాయుడు అవసరం చాలానే ఉంది.

(Credits: BCCI)

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటివరకూ సరిగా రాణించలేకపోయారు. కానీ వారి విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు యువ పేస్ సంచలనం జాఫర్ ఆర్చర్. అతను ఇటీవలే కింగ్స్ లెవెన్ పంజాబ్ పై జరిగిన మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ చేసి ప్రేక్షకులను అబ్బురపరిచాడు.

మరోసారి అలాంటి ప్రదర్శన చేయగలిగితే రాజస్థాన్ రాయల్స్ జట్టు మరో కీలక విజయం సాధించే అవకాశాలు మెండుగానే ఉన్నాయి.

మ్యాచ్ అంచనా

జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఆతిథ్య జట్టు రాజస్థాన్ రాయల్స్ ను ఓడించగలిగే సత్తా ఉన్న జట్లు చాలా తక్కువ.

అయితే ఎవరైనా వారిని ఓడించగలదు అంటే అది మంచి ఫామ్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే. చెన్నై జట్టు ఫామ్ దృష్ట్యా ఈ మ్యాచ్లో వారు విజయం సాధించే అవకాశాలు బాగానే ఉన్నాయి.

SHARE