Shikhar Dhawan of SRH and Kane Williamson captain of SRH during match forty two of the Vivo Indian Premier League 2018 (IPL 2018) between the Delhi Daredevils and the Sunrisers Hyderabad held at the Feroz Shah Kotla Ground, Delhi on the 10th May 2018. Photo by: Rahul Gulati /SPORTZPICS for BCCI

ఐపీఎల్ 2018 లో తమదైన ముద్ర వేస్తూ కొనసాగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుపై జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు నాల్గవ ఓవర్లో షకిబ్ అల్ హసన్ ద్వారా పెద్ద దెబ్బనే తిన్నారు. ఓపెనర్లు పృథ్వీ షా మరియు జేసన్ రాయ్ ను అతను అవుట్ చేయడంతో ఢిల్లీ జట్టు వెనుకంజ వేసింది.

అయితే తర్వాత బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా రన్ ఔట్ కావడంతో జట్టు మరింత కష్టాల్లో కూరుకుపోయింది. బౌలర్ హర్షల్ పటేల్ తరువాత వచ్చి తనవంతు ప్రయత్నం చేసి పరుగుల వేగం పెంచాడు. అయితే 14 వ ఓవర్లో అతను రన్ అవుట్ కావడంతో, జట్టు క్లిష్ట పరిస్థితిలో పడింది. కానీ యువ సంచలనం రిషబ్ పంత్ మాత్రం మరో వైపు నుండి ఇన్నింగ్స్ ను చక్కగా ఆడుతూ వచ్చాడు.

Photo Credit: IPL.

హర్షల్ పటేల్ అవుట్ అయిన తరువాత రిషబ్ పంత్ పరుగుల వేగం పెంచాడు. తరువాత జరిగిన ఆరు ఓవర్లలో వీలైనన్ని ఎక్కువ బంతులు ఆడటం విశేషం. 14 ఓవర్లకు 98 పరుగులు చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు చివరి ఓవర్లలో సంచలనమైన హిట్టింగ్తో పంత్ స్కోర్ను పరుగులెత్తించాడు.

అదే క్రమంలో అతను ఐపిఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు చేసిన భారత బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించాడు. కేవలం 63 బంతులు ఆడిన పంత్, 128 పరుగులు చేశాడు. దీనితో ఢిల్లీ స్కోర్ 187 పరుగులకు చేరింది.

188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆదిలోనే ఓపెనర్ అలెక్స్ హేల్స్ వికెట్ను కోల్పోయింది. అయితే మూడో నెంబర్లో వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ , ఓపెనర్ శిఖర్ ధవన్తో కలిసి జట్టు స్కోరును పరుగులెత్తించాడు. అయితే బ్యాటింగ్కు అంతా అనుకూలంగా లేని ఈ పిచ్ పై ఇరువురు ఆటగాళ్లు తమ అనుభవాన్ని జోడించి వేగంగా పరుగులు చేశారు.

దీనితో క్లిష్ట అనుకున్న ఆ స్కోరును సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అలవోకగా ఛేదించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ అజేయమైన 92 పరుగులు చేయగా, కెప్టెన్ కేన్ విలియమ్సన్ అజేయమైన 83 పరుగులు చేసి అతనికి చక్కటి సహకారం అందించాడు.

ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ ఏడాది ఐపిఎల్ సీజన్లో ప్లే ఆఫ్ దశకు చేరిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. ఇదే రీతిలో వారు ప్రదర్శనలు కొనసాగించగలిగితే ఎవరైనా వారిని ఆపడం కష్టమే!!

SHARE