Credits: BCCI

ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్ తన ఉగ్రరూపం చూపించడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఐపిఎల్ ఫైనల్ లో 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో వారు ఐపిఎల్ చరిత్రలో మూడు కప్పులు  గెలిచిన రెండవ చెట్టుగా రికార్డు సృష్టించారు .

అయితే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, ఆదిలోనే ఓపెనర్ శ్రీవత్స  వికెట్ తీసి మంచి పట్టు సాధించింది. కానీ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఓపెనర్ శిఖర్ ధావన్తో కలిసి జట్టు స్కోరును క్రమబద్ధీకరణలో పెంచుకుంటూ వెళ్లారు.

Credits: BCCI

ఈ ఇరువురు రెండవ వికెట్కు 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే శిఖర్ధావన్ అవుట్ అయిన వెంటనే వచ్చిన షకీబ్ అల్ హసన్ కూడా వేగంగా పరుగులు చేయడంతో జట్టు స్కోరు మరింత పెరిగింది. మధ్య ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ చివరిలో యూసుఫ్ పఠాన్ సంచలనమైన తిట్టిందో జట్టు స్కోరు వేగాన్ని బాగా పెంచాడు.

వెస్ట్ ఇండీస్ ఆల్రౌండర్ కార్లోస్ విరాట్ వెయిట్ కూడా తన బ్యాట్ కు పని చెప్పటంతో  నిర్ణీత 20 ఓవర్లలో సన్రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.

Credits: BCCI

అయితే 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓపెనర్లను, తొలి స్పెల్లో భువనేశ్వర్ కుమార్ అత్యద్భుతంగా కట్టడి చేశాడు. అతను పెట్టిన ఒత్తిడికి ఓపెనర్ ఫఫ్ డూ ప్లేసీస్ ను  సందీప్ శర్మ బౌలింగ్లో అవుటయ్యాడు.

కానీ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన సురేష్ రైనా ఓపెనర్ షేన్ వాట్సన్ తో కలిసి పరుగుల వేగాన్ని విపరీతంగా పెంచారు. ఈ ఇరువురు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను అలవోకగా ఆడుతూ అన్నివైపులా పరుగులు సాధించారు.

కేవలం 57 బంతుల్లో ఇరువురు రెండవ వికెట్కు 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన పూర్తిగా చెన్నై వైపు తిప్పేశారు . అయితే సురేష్ రైనా అవుట్ అయిన తరువాత వచ్చిన అంబటి రాయుడు వాట్సాన్ కు మంచి సపోర్టు ఇస్తూ జట్టు స్కోరును ముందుకు తీసుకు వెళ్ళాడు.

Shane Watson of the Chennai Superkings raises his bat after scoring a hundred during the Final of the Vivo Indian Premier League 2018 (IPL 2018) between the Chennai Super Kings and the Sunrisers Hyderabad held at the Wankhede Stadium in Mumbai on the 27th May 2018.
Photo by: Vipin Pawar /SPORTZPICS for BCCI

మరోవైపు షేన్ వాట్సన్ తన దూకుడును కొనసాగిస్తు తన కెరీర్ లోనే మూడో ఐపిఎల్ సెంచరీ సాధించాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్ వలన ఇంకా 9 బంతులు మిగిలి ఉండగానే చెన్నై సూపర్ కింగ్స్ వారి లక్ష్యాన్ని చేధించారు.

ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ వారి మూడవ ఐపిఎల్ టైటిల్ గెలుచుకోగా, అత్యధిక ఐపీఎల్ టైటిల్ను సాధించిన జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేశారు.

మరోవైపు మహేంద్రసింగ్ ధోని కూడా ఐపిఎల్ చరిత్రలో అత్యద్భుతమైన కెప్టెన్గా రికార్డు సృష్టించాడు. ఇప్పుడు అతను ఐపీఎల్ లో కూడా అందరికంటే ఎక్కువ సక్సెస్ సాధించిన కెప్టెన్ గా నిలిచాడు