రాయల్ చాలెంజర్స్ బెంగళూరు డెత్ ఓవర్లలో చక్కటి బౌలింగ్ చేసి ముంబై ఇండియన్స్ పై ముఖ్యమైన విజయం సాధించారు. ఐపీఎల్ 2018 లో ఇప్పటివరకూ తమ స్థాయికి తగిన ప్రదర్శనలు చేయలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు, ముంబై ఇండియన్స్ పై మాత్రం చక్కటి ప్రదర్శనతో కీలక విజయం సాధించారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును పవర్‌ప్లే ఓవర్లలో ముంబై ఇండియన్స్ బౌలర్లు చక్కగా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కట్టడి చేశారు. అయితే ఓపెనర్ గా టీం లోకి వచ్చిన పంజాబ్ ఆటగాడు మనన్ వోహ్రా ముంబయి బౌలర్లను చక్కగా జట్టుకు కీలకమైన పరుగులు సాధించాడు.

మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రెండన్ మెక్కలం, విరాట్ కోహ్లీ సహకారంతో జట్టును ముందుకు తీసుకెళ్లాడు. ఈ ఇరువురు మూడో వికెట్‌కు యాభై పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును మంచి స్థితిలో నిలబెట్టారు.

అయితే ముంబై బౌలర్లు విరాట్ కోహ్లీ మరియు బ్రెండన్ మెక్కలం ను త్వరగా ఔట్ చేసి మార్చ్ పై పట్టు సాధించారు. ముంబయి బౌలర్ హార్దిక్ పాండ్యా ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి ముంబయికు మంచి పట్టును అందించాడు. కానీ చివరి ఓవర్లో 24 పరుగులు బెంగళూరు జట్టు సాధించడంతో వారు నిర్ణీత 20 ఓవర్లలో 7 నష్టానికి 167 పరుగులు చేశారు.

168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్, తొలి ఓవర్లోనే ఓపెనర్ ఇషాన్ కిషన్ ను కోల్పోయింది. తర్వాత ఉమేష్ యాదవ్ తన సంచలన బౌలింగ్‌తో వరుస బంతుల్లో సూర్య కుమార్ యాదవ్ మరియు రోహిత్ శర్మను ఔట్ చేశాడు.

అయితే మిడిల్ ఆర్డర్లో జేపీ డుమిని మరియు హార్థిక్ పాండ్యా చక్కటి భాగస్వామ్యం నెలకొల్పి జట్టు స్థితిని కుదుట పరిచారు. కానీ డుమిని రనౌట్ కావడంతో జట్టు మరోసారి వెనుకంజ వేసింది. క్రీజులోకి వచ్చిన క్రునాల్, వేగంగా పరుగులు చేయలేకపోయాడు.

చివరిలో బెంగళూరు పేస్ బౌలర్లు మహమ్మద్ సిరాజ్ మరియు టిమ్ సౌతీ సంచలన డెక్ బౌలింగ్ చేయడంతో, ముంబయి ఇండియన్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముఖ్యమైన విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందంజ వేశారు.