Kings Xi Punjab win during match thirty eight of the Vivo Indian Premier League 2018 (IPL 2018) between the Kings XI Punjab and the Rajasthan Royals held at the Holkar Cricket Stadium, Indore on the 6th May 2018. Photo by: Deepak Malik /SPORTZPICS for BCCI

పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించడంతో రాజస్థాన్ పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది పంజాబ్ జట్టు. ఈ విజయంతో కేవలం 9 మ్యాచ్లలో ఆరు విజయాలు సాధించి ప్లే ఆఫ్ దశకు చేరుకునే రేస్ లో మరింత ముందుకెళ్లింది.

టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న రవిచంద్రన్ అశ్విన్ నిర్ణయం సరైనదేనంటూ నిరూపిస్తూ పంజాబ్ బౌలర్లు ఆదిలోనే ఓపెనర్ డార్సీ షార్ట్ వికెట్ తీశారు. తర్వాత కెప్టెన్ అజింక్యా రహానే కూడా అంతగా ఆకట్టుకోకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ క్లిష్టమైన పరిస్థితిలో పడింది.

తర్వాత బ్యాటింగ్కు వచ్చిన సంజూ శాంసన్, ఓపెనర్ జాస్ బట్లర్ తో కలిపి ఇన్నింగ్స్ను సరిదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ ఇరువురు మూడవ వికెట్ కు 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రాజస్థాన్ జట్టును మంచి స్థితికి తీసుకువెళ్లారు.

అయితే సంజూ శాంసన్ ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్కు వచ్చిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ మంచి ఫామ్లో కనబడ్డాడు. మయాంక్ అగర్వాల్, మనోజ్ తివారీ చక్కటి క్యాచ్ తీసుకోవడంతో అతను నిష్క్రమించాడు.

బెన్ స్టోక్స్ వికెట్ను తీసిన తరువాత కింగ్స్ లెవెన్ పంజాబ్ బౌలర్లు చెలరేగిపోయారు. అర్ధ సెంచరీ సాధించిన జొస్ బట్లర్ కూడా వెంటనే నిష్క్రమించడం తో రాజస్థాన్ జట్టు క్లిష్టమైన స్థితిలో పడింది. తరువాత బ్యాటింగ్ కు వచ్చిన రాహుల్ త్రిపాఠి, ఆర్చర్, కృష్ణప్ప గౌతమ్ లాంటి వారు ఎవరూ వారి స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోయారు.

చివరిలో శ్రేయాస్ గోపాల్ కొన్ని మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు స్కోరు 150 పరుగుల మార్కును దాటింది. కింగ్స్ లెవెన్ పంజాబ్ బౌలర్లలో ముజీబ్ రహమాన్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మరో వైపు ఆండ్రూ టై రెండు కీలక వికెట్లు తీసాడు.

153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. ఫామ్లో ఉన్న క్రిస్ గేల్ కేవలం మూడవ ఓవర్లో అవుట్ కావడంతో క్రీజ్లోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ కూడా అవుటయ్యాడు. దీనితో క్లిష్టమైన పరిస్థితుల్లో పడిన పంజాబ్ జట్టును కరుణ్ నాయర్ మరియు లోకేష్ రాహుల్ ఇద్దరూ కలిసి జట్టును పటిష్ట స్థితికి తీసుకువెళ్లారు.

కానీ పరుగుల వేగం పెంచే ప్రక్రియలో కరుణ్ నాయర్ అవుట్ కావడంతో కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు మరోసారి సమస్యల్లో పడింది. తరువాత వచ్చిన అక్షర్ పటేల్ కూడా వెనువెంటనే ఔట్ కావడంతో జట్టు మరింత కష్టాల్లో కూరుకుపోయింది.

KL Rahul of KXIP plays a shot during match thirty eight of the Vivo Indian Premier League 2018 (IPL 2018) between the Kings XI Punjab and the Rajasthan Royals held at the Holkar Cricket Stadium, Indore on the 6th May 2018. Photo by: Rahul Gulati /SPORTZPICS for BCCI

అయితే ఒకవైపు లోకేష్ రాహుల్  తన పని తాను చేసుకు పోతుండగా మార్కస్ స్టోయినిస్ మంచి సహకారాన్ని అందించాడు. మెల్లగా అర్ధ సెంచరీ సాధించిన రాహుల్ చివరి పది బంతుల్లో ఏకంగా 34 పరుగులు సాధించి పంజాబ్ జట్టుకు ముఖ్యమైన విజయం అందించాడు.

ఈ విజయంతో పంజాబ్ జట్టు 12 పాయింట్లతో మూడవ స్థానంలో కొనసాగుతుంది. మంగళవారం రాత్రి మరోసారి ఈ రెండు జట్లు జైపూర్లో తలపడనున్నాయి.

SHARE