Credits: BCCI

ఐపీఎల్ 2018 లో ఇప్పటివరకు అత్యద్భుతంగా ఆడిన రెండు జట్లు- చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవడంతో, మొదటి క్వాలిఫయర్లో పోటీ పడ్డారు.

అయితే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్, తొలి బంతికి శిఖర్ ధవన్ వికెట్ తీసి సన్ రైజర్స్ భారీ దెబ్బతీశారు. తరువాత స్కోరు పెంచే క్రమంలో శ్రీ వార్ట్స్ గోస్వామి, కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇద్దరూ అవుటయ్యారు.

Credits: BCCI

అలా మొదలైన సన్రైజర్స్ పతనం మిడిల్ ఆర్డర్లో వచ్చిన మనీష్ పాండే, షకీబల్ హసన్ కూడా పెద్దగా రాణించకపోవడంతో మరింత కష్టాల్లో కూరుకుపోయారు. కానీ యూసఫ్ పఠాన్ వీలైనంత వరకూ వికెట్లు పోకుండా కాపాడుకుంటూ రాగా, చివరిలో వెస్ట్ ఇండీస్ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్వైట్ సంచలనమైన హిట్టింగ్ చేశాడు.

కేవలం 29 బంతుల్లో అతను 43 పరుగులు సాధించి, జట్టు స్కోరును నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులకు తీసుకువెళ్లాడు. అయితే 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై బ్యాట్స్మెన్, ఆదిలోనే తడబాటుకు గురి అయ్యారు.

తొలి ఓవర్లోనే భువనేశ్వర్ కుమార్ షేన్ వాట్సన్ వికెట్ను తీసి సన్రైజర్స్ జట్టును మ్యాచ్ లో నిలిపాడు. అయితే నాల్గవ ఓవర్లో సిద్ధార్థ్ కౌల్  వరుస బంతుల్లో సురేష్ రైనా,అంబటి రాయుడు వికెట్లు తీయడంతో హైదరాబాద్ జట్టు మ్యాచ్పై మంచి పట్టు సాధించింది. పవర్ ప్లే ఓవర్ల అయిన తర్వాత రషీద్ ఖాన్ తన స్పిన్ మాయాజాలం చూపించడంతో కెప్టెన్ ధోనీ కూడా నిష్క్రమించాడు.

Credits: BCCI

పరుగులను బాగా కట్టడి చేస్తూ చెన్నై జట్టుపై విపరీతమైన ఒత్తిడి పెంచినా హైదరాబాద్ బౌలర్లు తరువాత డ్వెయిన్ బ్రావో, జడేజా వికెట్లను కూడా సాధించారు. కానీ కార్లోస్ బ్రాత్వైట్ వేసిన 18 వ ఓవర్ లో ఓపెనర్ ఫఫ్ డుప్లెసిస్ తన సంచలనమైన హిట్టింగ్ ప్రదర్శన చేయడంతో చెన్నై జట్టు విజయంపై కన్నేసింది.

సిద్ధార్థ్ కౌల్ వేసిన 19 వ ఓవర్లో బౌలర్ శార్దూల్ ఠాకూర్ కేవలం అయిదు బంతుల్లో 15 పరుగులు సాధించడంతో చెన్నై జట్టు తమ విజయానికి చాలా చేరువైంది. కేవలం ఆరు పరుగులు కావాల్సిన సమయంలో డుప్లెసిస్ మరోసారి శిక్ష సాధించడంతో చెన్నై ఈ జట్టు ఈ విజయంతో ఐపీఎల్ ఫైనల్కు చేరుకుంది.

అయితే సన్ రైజర్స్ జట్టు ఓటమి పాలైనప్పటికీ వారు ఇంకా టోర్నమెంట్ నుండి నిష్క్రమించ లేదు. వారు ఎలిమినేటర్లో గెలిచిన విజేతతో ఈడెన్ గార్డెన్స్లో శుక్రవారం మ్యాచ్ ఆడనున్నారు.