Credits: BCCI

ఐపీఎల్ 2018 లో అత్యుత్తమ జట్లలో ఒకటిగా పేరొందిన కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు రెండవ భాగంలో పూర్తిగా తమ ఫామ్ ను కోల్పోయింది. అయితే చెన్నైపై కచ్చితంగా గెలవాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్లో కూడా వారు తడబడటంతో ప్లే ఆఫ్ దశకు క్వాలిఫై కాకుండానే ఈ ఏడాది సీజన్ నుండి వైదొలిగారు.

గత 8 మ్యాచ్ల్లో ఏడు పరాజయాలు చవిచూసిన పంజాబ్ జట్టు, ఐపీఎల్ చరిత్రలోనే ఇలా క్వాలిఫై కాని జట్టుగా మిగిలిపోతున్నారు. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ఆదిలోనే పంజాబ్ జట్టు టాప్ ఆర్డర్ వెన్ను వంచారు.

సౌత్ ఆఫ్రికా క్రికెటర్ లుంగి నిగిడి తొలి స్పెల్ లోనే కీలకమైన క్రిస్ గేల్, కెఎల్ రాహుల్ వికెట్లను తీసి చెన్నైను ముందుంచాడు. తొలి నాలుగు ఓవర్లలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయిన పంజాబ్ జట్టు చాలా క్లిష్టమైన పరిస్థితిలో పడింది.

అయితే ఆ సమయంలో బ్యాటింగ్కు వచ్చిన మనోజ్ తివారి, డేవిడ్ మిల్లర్ తో కలిసి చక్కటి భాగస్వామ్యం నెలకొల్పడంతో జట్టు కాస్త ఉపశమనాన్ని పొందింది. వీరిరువురు త్వరగా అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్కు వచ్చిన కరుణ్ నాయర్ చాలా వేగంగా పరుగులు చేశాడు.

అయితే అతనికి వేరే ఆటగాళ్ళ నుండి ఎటువంటి సహకారం లభించకపోవడంతో అర్ధసెంచరీ చేసిన తర్వాత అవుటయ్యాడు. దీనితో కేవలం 19.4 ఓవర్లలో ఆలౌటైన పంజాబ్ జట్టు 153 పరుగులు చేసింది.

Credits: BCCI

154 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆరంభంలోనే తడబడి మూడు కీలక వికెట్లను సమర్పించుకుంది. కానీ చెన్నై జట్టు బౌలర్ లైన హర్భజన్ సింగ్, దీపక్ చాహర్ ను క్రీజులోకి పంపడంతో వారు బౌలర్లను బాగా ఎదుర్కొన్నారు.

మరోవైపు రైనా తన పని తాను చేసుకు పోతుండటంతో చెన్నై పై ఒత్తిడి బాగా తగ్గింది. చివరిలో బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా తన బ్యాట్ జూలు విదల్చడంతో స్కోరు చాలా అలవోకగా ఛేదించారు చెన్నై సూపర్ కింగ్స్.

ఈ విజయంతో చెన్నై జట్టు రెండవ స్థానాల్లో ప్లే ఆఫ్ దశకు క్వాలిఫై అవ్వగా, పంజాబ్ జట్టు మాత్రం ఏడవ స్థానంలో నిలిచి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు.

SHARE