Credits: BCCI

రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు పై బౌలర్ల సహాయంతో కీలక విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ విజయం తో వారు 10 మ్యాచ్ లలో 7 విజయాలు సాధించి ప్లే ఆఫ్ దశకు చాలా దగ్గరయ్యారు.

టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ఆది నుండే మ్యాచ్ పై మంచి పట్టు సాధించారు. రెండో ఓవర్లోనే బ్రెండన్ మెకల్లమ్ ను అవుట్ చేసాడు లుంగీ ఎంగిడి. తరువాత విరాట్ కోహ్లీ, ఏబి డివిల్లీర్స్ కూడా ఆకట్టుకోలేకపోయారు. వారు ఇరువురు తక్కువ స్కోరుకే అవుట్ కావడం తో బెంగుళూరు జట్టు కష్టాల్లో పడింది.

Credits: BCCI

ఈ ఏడాది ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న పార్థివ్ పటేల్ మంచి ప్రదర్శన చేసి అర్ధ సెంచరీ సాధించినప్పటికీ, అతనికి సరైన సహాయం అందిచలేకపోయారు. దీనితో అతను తప్పితే మరో బాట్స్మన్ రెండు అంకెల స్కోర్ చేయలేకపోయారు. ఐతే చివరిలో న్యూజిలాండ్ పేస్ బౌలర్ టిమ్ సౌథీ చక్కటి బాటింగ్ చేసి కేవలం 26 బంతుల్లో 36 పరుగులు చేయడం తో బెంగుళూరు జట్టు స్కోరు 125 పరుగులు దాటింది. నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసారు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు.

చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా చక్కగా బౌలింగ్ చేసి 3 వికెట్లు దక్కించుకోగా, వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా మంచి ప్రదర్శన చేసాడు. మొత్తానికి చెన్నై బౌలింగ్ విభాగం చాలా కీలకమైన ప్రదర్శన చేసారు.

Ravindra Jadeja of Chennai Super Kings celebrates wicket of Mandeep Singh of Royal Challengers Banglore during match thirty five of the Vivo Indian Premier League 2018 (IPL 2018) between the Chennai Super Kings and the Rajasthan Royals held at the Maharashtra Cricket Association Cricket Stadium, Pune on the 5th May 2018.
Photo by: Prashant Bhoot /SPORTZPICS for BCCI

128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ బాట్స్మన్, ఆదిలోనే వాట్సన్ వికెట్ కోల్పోయారు. ఐతే మంచి ఫామ్ లో ఉన్న అంబటి రాయుడు, సురేష్ రైనా తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం చేసి ఇన్నింగ్స్ ను కుదుటపరిచాడు. మ్యాచ్ చెన్నై వైపు మళ్లుతున్న సమయంలో బెంగుళూరు బౌలర్లు మూడు వికెట్లు తీసి, ఆసక్తి రేకేతించారు.

ఐతే తరువాత బాటింగ్ కు వచ్చిన ఎం ఎస్ ధోని, బ్రేవో ఇద్దరు ఎటువంటి రిస్కులు తీసుకోకుండా జట్టును విజయతీరాలకు తీసుకువెళ్లారు. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ దశకు చేరడానికి మరింత దగ్గరైంది. వారు మరో విజయం సాధిస్తే, ఈ ఏడాది ప్లే ఆఫ్ కు చేరిన తొలి జట్టు అవుతారు.