Credits: BCCI

సన్ రైజర్స్ హైదరాబాద్ పై తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు డీలా పడింది. ఈ మ్యాచ్లో పరాజయంతో వారు ప్లే ఆఫ్ దశకు కాలిపై అవ్వాలంటే మిగిలిన మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది.

టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పవర్ప్లే ఓవర్లలో సంచలనమైన బౌలింగ్ చేశారు. ఓపెనర్లు అలెక్స్ హేల్స్ శిఖర్ ధవన్ పెద్దగా రాణించకపోవడంతో బెంగళూరు చెట్టు మంచి పైచేయి సాధించింది. అయితే తర్వాత వచ్చిన మనీష్ పాండే కూడా ఆకట్టుకోకపోవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కష్టాల్లో కూరుకుపోయింది.

కానీ క్రీజులోకి వచ్చిన బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ తో కలిసి ఇన్నింగ్స్ నో సరిదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ ఇరువురు నాలుగవ వికెట్కు 64 పరుగులు సాధించి జట్టుకు కీలకమైన పరుగులు అందించారు.

అయితే బెంగళూరు బౌలర్లు ఉంటే త్వరలో సంచలమైన బౌలింగ్ చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కేవలం 146 పరుగులకే ఆల్ అవుట్ చేసి కట్టడి చేశారు. బ్యాటింగ్కు బాగానే అనుకూలిస్తున్న హైదరాబాద్ పిచ్ పై 147 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి దిగిన బెంగళూరు బ్యాట్స్మన్, ఇన్నింగ్స్ నో చాలా దాటిగా ప్రారంభించారు.

ముఖ్యంగా పార్థివ్ పటేల్ వేగంగా పరుగులు చేస్తూ మ్యాచ్ను బెంగళూరు వైపు తిప్పేశాడు. కానీ షకీబ్ అల్ హసన్ అతని వికెట్ తీసినప్పటికీ, పవర్ప్లే ఓవర్లలో క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ తన సంచలనమైన ఫామ్ ను కనబరిచాడు.

Credits: BCCI

అయితే పవర్ ప్లై ఓవర్లు ముగిసిన తర్వాత బెంగళూరు జట్టు వరుసగా వికెట్లు కోల్పోతూ, మ్యాచ్పై పట్టు కోల్పోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ పరుగులు వరదకు అడ్డుకట్ట వేశారు.

వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయిన బెంగళూరు జట్టుకు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ మన్దీప్ సింగ్ , కోలిన్ డి గ్రాండ్హోమ్ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ చివరిలో భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బౌలింగ్ చేయడంతో సన్ రైజర్స్ కీలకమైన విజయం సాధించింది.

ఈ విజయంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ దశకు క్వాలిఫై అయిన తొలి జట్టు అయ్యింది. కేవలం 10 మ్యాచ్ లలో 8 విజయాలు సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ఆపేదెవరు చూడాలి!!