క్రికెట్ చరిత్రనే మార్చేసిన ఒకే ఒక్క దేశవాళీ టోర్నమెంట్ ఐపీఎల్. 2008 లో ప్రారంభమైన ఈ ధనిక లీగ్, ఆటగాళ్లకు ఆర్థిక భద్రతను కలిపించింది. భారత్ ఉపఖండంలో కూడా క్రికెట్ కు సరికొత్త క్రేజ్ తీసుకొచ్చి పెట్టింది ఐపీఎల్.

ఐపీఎల్ 11 వ ఎడిషన్ ప్రారంభం కాన్నుండటంతో ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ లో ఒక్క సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితా చూద్దాం.

#10. హర్భజన్ సింగ్ – 24 వికెట్లు (2013)

భారత్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్ గా పేరు తెచ్చుకున్న హర్భజన్, ముంబై ఇండియన్స్ కు అదే రీతిలో ఆడాడు. 2013 లో జరిగిన ఐపీఎల్ సీజన్ లో ఏకంగా 24 వికెట్లు తీసాడు.

#9. లసిత్ మలింగా- 24 వికెట్లు (2015)

ఐపీఎల్ రెండో సీజన్ లో తొలి సారి దక్షిణ ఆఫ్రికాలో మొదటి సారి ముంబై ఇండియన్స్ కు ఆడిన లసిత్ మలింగా, ప్రపంచంలోనే అత్యుత్తమ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా పేరు సాధించాడు. 2015 లో జరిగిన ఐపీఎల్ సీజన్ లో 24 వికెట్లు తీసాడు ఈ శ్రీలంక సూపర్ స్టార్.

#8. సునీల్ నరైన్- 24 వికెట్లు (2012)

తన తొలి సీజన్ లో సునీల్ నరైన్, తన స్పిన్ మాయాజాలాన్ని చూపించాడు. అతని అమ్ములపొడి ఉన్న అస్త్రాలకు బాట్స్మెన్ దగ్గర సమాధానం లేకుండాపోయింది. 2012 లో 24 వికెట్లు తీసి కోల్ కతా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

#7. జయదేవ్ ఉనాద్కట్ – 24 వికెట్లు (2017)

ఇటీవలే టీ 20 క్రికెట్లో మంచి పేరు తెచ్చుకున్న ఉనాద్కట్, గత ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ లో రైసింగ్ పూణే సూపర్ జైంట్ ఫైనల్ వరకు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు.

#6. మోర్నీ మోర్కెల్- 25 వికెట్లు (2012)

2012 లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ప్రాతినిధ్యం వహించిన మోర్నీ మోర్కెల్, తన కెరీర్ లోనే అత్యుత్తమ ఐపీఎల్ సీజన్ ఆడాడు. అతను 16 మ్యాచ్ లలో 25 వికెట్లు తీసి, పర్పిల్ కాప్ గెలుచుకున్నాడు.

#5. డ్వైన్ బ్రేవో – 26 వికెట్లు

ఐపీఎల్ చరిత్రలోనే రెండు పర్పిల్ కాప్ లు గెలుచుకున్న తొలి ఆటగాడు బ్రేవో. చెన్నై సూపర్ కింగ్స్ విజయాలలో కీలక పాత్ర పోషించిన బ్రేవో, 2015 లో కూడా మరో సారి తన భూమిక పోషించాడు. అతను 16 మ్యాచ్ లలో 26 వికెట్లు తీసాడు.

#4. భువనేశ్వర్ కుమార్- 26 వికెట్లు (2017)

భారత్ క్రికెట్లో ముఖ్యమైన బౌలర్ గా మారిన భువనేశ్వర్ కుమార్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక సభ్యుడు. అతను ఐపీఎల్ ద్వారానే తన బౌలింగ్ లో చాలా మెళుకువలు నేర్చుకున్నాడు.

ఐపీఎల్ చరిత్రలో పర్పిల్ కాప్ రెండు సార్లు గెలుచుకున్న రెండో బౌలర్ అయ్యాడు భువనేశ్వర్ కుమార్. 2017 లో జరిగిన ఐపీఎల్ లో కేవలం 14 మ్యాచ్ ల్లో 26 వికెట్లు తీసుకున్నాడు.

#3. జేమ్స్ ఫాల్కనేర్ – 28 వికెట్లు (2013)

2013 ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించిన ఆస్ట్రేలియా అల్ రౌండర్ జేమ్స్ ఫాల్కనేర్, 28 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. అయితే రాజస్థాన్ రాయల్స్ మాత్రం క్వాలిఫైయర్ లలోనే వెనుదిరిగింది.

#2. లసిత్ మలింగ- 28 వికెట్లు (2011)

ఐపీఎల్ రెండో సీజన్ లో తొలి సారి దక్షిణ ఆఫ్రికాలో మొదటి సారి ముంబై ఇండియన్స్ కు ఆడిన లసిత్ మలింగా, ప్రపంచంలోనే అత్యుత్తమ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా పేరు సాధించాడు. అతను 2011 సీజన్ లో కేవలం 16 మ్యాచ్లలో 28 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు.

#1. డ్వైన్ బ్రేవో – 32 వికెట్లు

తన ఐపీఎల్ కెరీర్ ను ముంబై ఇండియన్స్ తో ప్రారంభించిన డ్వైన్ బ్రేవో, చెన్నై సూపర్ కింగ్స్ లో ఆడటం మొదలు పెట్టాక టీ 20 క్రికెట్లోనే అత్యుత్తమ డెత్ బౌలర్లలో ఒకడిగా మారాడు.

2013 సీజన్ లో ఏకంగా 32 వికెట్లు తీసి ఒకే సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు.

SHARE