క్రికెట్ చరిత్రనే మార్చేసిన ఒకే ఒక్క దేశవాళీ టోర్నమెంట్ ఐపీఎల్. 2008 లో ప్రారంభమైన ఈ ధనిక లీగ్, ఆటగాళ్లకు ఆర్థిక భద్రతను కలిపించింది. భారత్ ఉపఖండంలో కూడా క్రికెట్ కు సరికొత్త క్రేజ్ తీసుకొచ్చి పెట్టింది ఐపీఎల్.

ఐపీఎల్ 11 వ ఎడిషన్ ప్రారంభం కాన్నుండటంతో ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ లో అత్యధిక క్యాచులు పట్టిన టాప్ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#5. డ్వైన్ బ్రేవో – 60 క్యాచులు

కేవలం బంతి తో ఆఖరి ఓవర్లలో వికెట్లు తీయడం, చివరిలో వచ్చి త్వరగా పరుగులు బాట్ తో చేయడమే కాకుండా బ్రేవో ఫీల్డింగ్ లో కూడా మెరుపులు మెరిపిస్తాడు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చాలా ముఖ్యమైన ఆటగాడిగా ఎదిగిన బ్రేవో, అన్ని రంగాల్లో మంచి పదును కలిగిన ఆటగాడు. అతను ఐపీఎల్ లో గొప్ప బౌలర్ మాత్రమే కాదు, ఫీల్డింగ్ లో కూడా 60 క్యాచులు పట్టి టాప్ 5 లో స్థానం సాధించాడు.

#4. కిరన్ పోల్లర్డ్- 70 క్యాచులు 

బహుశా ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు చూసిన అత్యుత్తమ ఫీల్డర్ కిరన్ పోల్లర్డ్ అంటే అందులో ఆశ్చర్యం పెద్దగా ఉండకపోవచ్చు. అతను ఐపీఎల్ ఆడటం మొదలు పెట్టినప్పటినుండి ముంబై ఇండియన్స్ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు.

ఒక క్రికెట్ గ్రౌండ్ లో ఉన్న అన్ని ముఖ్యమైన ఫీల్డింగ్ స్థానాల్లో అతనే ఫీల్డింగ్ చేస్తాడు. అతను క్యాచ్ వదిలేయడం కూడా చాలా అరుదే. తన ఐపీఎల్ కెరీర్ లో ఇప్పటి వరకు 70 క్యాచులు పట్టాడు పోల్లర్డ్.

#3. రోహిత్ శర్మ- 71 క్యాచులు

ఐపీఎల్ చరిత్రలో నాలుగు ట్రోఫీలు సాధించిన ఒకే ఒక ఆటగాడు, రోహిత్ శర్మ. అతను కేవలం బాట్ తోనే కాకుండా బంతితో కూడా హాట్ట్రిక్ తీసాడు. అంతే కాకుండా ఫీల్డింగ్ చేసేటప్పుడు కూడా పాదరసంలా కదులుతాడు.

తన కెరీర్లో ఇప్పటి వరకు డెక్కన్ ఛార్జర్స్ మరియు ముంబై ఇండియన్స్ కు ఆడిన రోహిత్ శర్మ, మొత్తం 159 మ్యాచ్ లలో 71 క్యాచులు పట్టి మూడో స్థానం దక్కించుకున్నాడు.

#2. ఏబి డివిల్లీర్స్- 72 క్యాచులు 

తన ఐపీఎల్ కెరీర్ ను ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ప్రారంభించిన ఏ బి డివిల్లీర్స్ కేవలం బాట్ తోనే కాకుండా, ఫీల్డింగ్ లో కూడా మెరుపులు మెరిపించాడు. ప్రపంచంలోనే అత్యుతమ ఫీల్డర్లలో ఒకడైన డివిల్లీర్స్, అతని ఫామ్ ను ఐపీఎల్ లో కూడా కనబరుస్తూనే ఉన్నాడు.

తరువాత బెంగుళూరు ఫ్రాంచైజ్ లో చేరిన డివిల్లీర్స్, అక్కడ కూడా ముఖ్యమైన ఫీల్డింగ్ చోట ఉంటూ ఇప్పటి వరకు 72 క్యాచులు సాధించాడు.

#1. సురేష్ రైనా – 86 క్యాచులు 

ఐపీఎల్ లో అత్యంత గొప్ప ఆటగాడు ఎవరంటే, బహుశా సురేష్ రైనా అంటే ఎక్కువ మంది వాడిచారేమో. అతను ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసాడు అలానే ఇప్పుడు ఐపీఎల్ లోనే ఎక్కువ క్యాచులు కూడా తీసుకున్న ఆటగాడు అతడే.

భారత్ క్రికెట్లో యువరాజ్ సింగ్ తరువాత అంత గొప్ప ఫీల్డర్ అయినా తొలి ఆటగాడు, సురేష్ రైనా. అతను ఫీల్డింగ్ చేస్తున్నపుడు అటు వైపు పెద్ద షాట్లు బాట్స్మన్ ప్రయత్నించారు అంటే అది అతిశయోక్తి కాదు. ఇప్పటి వరకు అతను 86 క్యాచులు సాధించి అందరికంటే పైన ఉన్నాడు.

 

SHARE