ఐపీఎల్ లో భాగంగా నేడు ముంబై వాంఖడే స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోరాహోరీగా తలపడనున్నాయి. ఇప్పటికే ఈ రెండు జట్లు పరాజయలాతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో నేడు జరగబోయే మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలనే కసితో బరిలోకి దిగనున్నాయి ఈ రెండు జట్లు.

ఐపీఎల్ టోర్నీ మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు ఈ రెండు జట్లు 3 మ్యాచులు ఆడాయి. అయితే ముంబై ఇండియన్స్ 3 మ్యాచులు ఆడినా ఒక్క మ్యాచులో కూడా గెలవలేకపోయింది. దీంతో జట్టులో చాలా నిరాశ ఏర్పడింది. బ్యాట్స్‌మెన్ వైఫల్యాలను అధిగమించి ఈ మ్యాచ్‌లో గెలవాలని చూస్తుంది ముంబై. రోహిత్ శర్మ సారధ్యంలో తమ జట్టు చాలా బలంగా ఉందని ముంబై ఇండియన్స్ కోచ్ పొలార్డ్ అన్నారు. బెంగళూరుతో తలపడే మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణి కొట్టాలని చూస్తున్నారు ముంబై ఇండియన్స్.

మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచుల్లో కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై గెలిచిన బెంగళూరు ఆ విజయాన్ని కంటిన్యూ చేయలేకపోయింది. దీంతో నేటి మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి మళ్లీ ట్రాక్‌లోకి రావాలని చూస్తుంది. తమ జట్టులో అందరు మంచి ఫామ్‌లో ఉన్నారని కెప్టెన్ విరాట్ ధీమాగా ఉన్నాడు.

ఇలాంటి హోరాహోరీ పోరులో ఎవరు విజయం సాధిస్తారనే విషయం ఆసక్తిగా మారింది. ముంబై వాంఖడే స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచ్‌లో టాస్ చాలా కీలక పాత్ర పోషించనుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోనున్న టీమ్ 200 భారీ పరుగులను ప్రత్యర్థి టీమ్‌కు నిర్దేశించాలని చూస్తున్నాయి. మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికాసేపట్లో ప్రత్యక్షంగా చూడాల్సిందే.

SHARE