Credits: BCCI

ఐపీఎల్ రెండవ భాగంలో మరోసారి తమ సత్తా చాటిన ముంబయి ఇండియన్స్ ఆదివారం తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనున్నారు. అయితే ఇందులో ఢిల్లీ డేర్ డెవిల్స్ పై విజయం సాధిస్తే కచ్చితంగా ప్లే ఆఫ్ దశకు వెళ్లే అవకాశాలు వారికి మెండుగా ఉన్నాయి.

మరోవైపు ఇప్పటివరకు తడబడుతూ వచ్చిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్పై ముఖ్యమైన విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ పై కూడా వారు అదే జోరును కనబరచడానికి చూస్తున్నారు.

పిచ్ రిపోర్టు

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లాలో జరగనున్న ఈ మ్యాచ్ లో పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే స్పిన్నర్లు అనుకూలించనప్పటికీ గ్రౌండ్లో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తుంది.

ఈ స్టేడియంలో జరిగిన గత రెండు మ్యాచ్లలో బ్యాట్స్మన్ అధికంగా పరుగులు చేయడం విశేషం. ఈ సారి కూడా అలానే బ్యాట్స్మన్కు కాస్త ఎక్కువ అనుకూలించే అవకాశాలు ఉన్నాయి.

టాస్ గెలిస్తే?

టాస్ గెలిచిన కెప్టెన్ తొలుత బ్యాటింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా ఈ మధ్యకాలంలో టాస్ గెలిస్తే తొలుత పాలుచేస్తున్న ప్పటికీ ఈ స్టేడియంలో పిచ్ రెండవ ఇన్నింగ్స్లో స్పిన్నర్లకు మరింత సహకారం అందిస్తుంది దీనితో తొలి బ్యాటింగ్ చేస్తే మంచి స్కోరు సాధించి అపోజిషన్ జట్టును ఒత్తిడికి గురి చేయవచ్చు.

హెడ్ టు హెడ్ రికార్డ్

ఇప్పటివరకు ఈ ఇరు జట్లు ఐపిఎల్ చరిత్రలో 21 సార్లు తలపడ్డాయి. అయితే ఇందులో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు పది విజయాలు సాధించగా, ముంబై ఇండియన్స్ జట్టు 11 విజయాలతో కొంచెం ముందున్నది.

మరోవైపు ఫెరోజ్ షా కోట్లా గ్రౌండ్ లో ఈ ఇరు జట్లు ఎనిమిది మ్యాచ్ల్లో తలపడగా, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ఏకంగా అయిదు విజయాలు సాధించడం విశేషం.

ముఖ్యమైన ఆటగాళ్లు

ఢిల్లీ డేర్డెవిల్స్ వారికి స్థాయికి తగిన ప్రదర్శనలు చేయకపోయినప్పటికీ వారి జట్టులో చాలా మంచి ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఇటీవలే పెద్దగా తన ఫామ్ ను కనబర్చలేకపోయిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్ లో జట్టుకు కీలకం కానున్నాడు.

అతను ఒంటిచేత్తో మ్యాచ్ను తిప్పగలిగే సత్తా ఉన్నవాడు. ముఖ్యంగా అతను డెత్ ఓవర్లలో సంచలమైన హిట్టింగ్ చేయగలిగే ప్రతిభ కలిగి ఉన్నాడు.

ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలే పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అతను ఫామ్లో లేకపోవడంతో ముంబై జట్టు చాలా కష్టాలను అనుభవించింది. అయితే ముఖ్యమైన మ్యాచ్లలో బాగా ఆడే రికార్డు ఉన్న రోహిత్ మరోసారి ఈ మ్యాచ్లో కీలకం కానున్నాడు.

మ్యాచ్ అంచనా

ఢిల్లీ జట్టు ఇటీవలే చెన్నై జట్టుపై ముఖ్యమైన విజయం సాధించినప్పటికీ, కీలక మ్యాచ్ల్లో ముంబయి ఇండియన్స్ జట్టును ఆపడం దాదాపు అసంభవం.

అయితే మ్యాచ్ విన్నర్లు తో కూడుకుని ఉన్న ఢిల్లీ జట్టు తమ స్థాయికి తగిన ప్రదర్శన చేస్తే మరోసారి విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

SHARE