ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి చెవిచూసిన కింగ్స్ XI పంజాబ్ జట్టు ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తో తలపడనున్నారు. ఐతే ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే వారు ప్లే ఆఫ్ దశకు చేరడంలో కీలక అడుగు వేస్తారు. దీనితో ఈ మ్యాచ్ పై అభిమానుల్లో చాలా ఆసక్తి నెల్కొనున్నది.

మరో వైపు రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ లో తప్పక విజయం సాధించాల్సి ఉంది. ఒక వేళా వారు ఈ మ్యాచ్ లో పరాజయం పాలైతే ప్లే ఆఫ్ దశకు క్వాలిఫై అవ్వడం కష్టం అవ్వనుంది.

పిచ్ రిపోర్ట్

ఇండోర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ మరో సారి బాటింగ్ కు బాగా అనుకూలించనుంది. సాధారణంగా 180 పరుగుల సగటు స్కోరు ఉన్న ఈ గ్రౌండ్ లో బౌలర్లకు అంత సహకారం లేకపోవడం గమనార్హం.

అయితే గ్రౌండ్ కూడా చాలా చిన్నది అవ్వడంతో పరుగులు గట్టిగా పారడం ఎప్పుడు సాధారణ విషయమే. మరోసారి బ్యాటింగ్కు అనుకూలమైన వికెట్ ఈ మ్యాచ్ లో ఉంటుందని భావించవచ్చు.

టాస్ గెలిస్తే?

టాస్ గెలిచిన కెప్టెన్ తొలుత బౌలింగ్ చేయడానికి ఇష్టపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మ్యాచ్ జరిగినంత సమయం పిచ్ పెద్దగా మారక పోవటమే ఇందుకు ప్రధాన కారణం.

పైగా గ్రౌండ్ బాగా చిన్నది కావడంతో బౌండ్రీలు సాధించడం చాలా తేలిక దీనితో చేజింగ్ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండు జట్లకు మంచి బాట్స్మన్ ఉండటంతో ఈ మ్యాచ్ మరో సారి ఉత్కంఠంగా ఉండటం ఖాయం గా కనిపిస్తుంది.

హెడ్ టు హెడ్ రికార్డు

ఇప్పటి వరకు ఈ ఇరు జట్లు 15 సార్లు ఐపీఎల్ చరిత్రలో తలపడ్డాయి. ఐతే ఇందులో రాజస్థాన్ రాయల్స్ జట్టు 9 సార్లు విజయం సాధించగా, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు 6 సార్లు విజయం సాధించింది. ఇండోర్ లో ఇప్పటి వరకు 5 మ్యాచ్ లలో 3 విజయాలు సాధించారు కింగ్స్ XI పంజాబ్ జట్టు.

కీలక ఆటగాళ్లు

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అజింక్య రహానే మరోసారి కీలక పాత్ర పోషించనున్నాడు. ఈ ఏడాది జరిగిన మ్యాచ్లలో కెప్టెన్ రహానే మంచి ఫామ్ కనబరిచాడు. ఐతే కింగ్స్ XI పంజాబ్ బౌలర్లను సరిగా ఆడాలంటే దానికి రహానే ఇన్నింగ్స్ కీలకం కానుంది.

అతను ఒక వైపు జట్టు ఇన్నింగ్స్ ను నడిపిస్తే, మిగిలిన బాట్స్మన్ హార్డ్ హిట్టింగ్ చేస్తూ జట్టు స్కోర్ ను ముందుకు తీస్కువెళ్తారు.

కింగ్స్ XI పంజాబ్ జట్టుకు మరో సారి ఓపెనర్లు కే ఎల్ రాహుల్, క్రిస్ గేల్ కీలకం కానున్నారు. ఇప్పటి వరకు గేల్ ను మాములుగా వాడుతున్న పంజాబ్ జట్టు, ఇకపై అతన్ని అన్ని మ్యాచ్ లలో ఆడించే అవకాశం ఉంది.

గత మ్యాచ్ లో మరో సారి అర్ధ సెంచరీ సాధించిన గేల్, రాహుల్ తో కలిసి మంచి ప్రారంభాన్ని అందించాడు. మరో సారి ఈ ద్వయం ఎలా ఆడతారు అన్న దాన్ని బట్టే వారి విజయ అవకాశాలు ఆదారిపడి ఉంటాయి.

మ్యాచ్ అంచనా

రాజస్థాన్ రాయల్స్ జట్టులో చాలామంది మంచి ఆటగాళ్లు ఉన్నప్పటికీ వారు ఫామ్ లేక సతమతమవుతున్నారు. మరోవైపు పంజాబ్ జట్టు మరింత పటిష్టమైన బాటింగ్ ఆర్డర్ తో ఉంది. దీనితో ఈ మ్యాచ్ లో కింగ్స్ లెవెన్ పంజాబ్ గెలిస్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

SHARE