కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లు అద్భుతమైన కనబరచడంతో రాజస్థాన్  రాయల్స్ పై ముఖ్యమైన విజయం సాధించారు. ఈ విజయంతో ప్లే ఆఫ్ రేసులో ముందంజ వేసింది కార్తిక్ సేన.

టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు, పవర్ప్లే ఓవర్లలో పెద్దగా బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. ఫామ్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓపెనర్ జోస్ బట్లర్తో కలిసి రాహుల్ త్రిపాఠి మంచి ఆరంభాన్ని అందించారు.

తొలి అయిదు ఓవర్లలోనే 63 పరుగులు సాధించి జట్టుకు మంచి పునాది వేశారు. అయితే ఒకసారి రాహుల్ త్రిపాఠి ఔట్ అయిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టు పతనం ప్రారంభమైంది. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన అజింక్యా రహానే వెంటనే వెనుదిరగగా, జాస్ బట్లర్ కూడా వెనువెంటనే అవుటయ్యాడు.

Jos Buttler of Rajasthan Royals during match forty nine of the Vivo Indian Premier League 2018 (IPL 2018) between the Kolkata Knightriders and the Rajasthan Royals held at the Eden Gardens Cricket Stadium in Kolkata on the 15th May 2018.
Photo by: Prashant Bhoot /SPORTZPICS for BCCI

మిడిల్ ఆర్డర్లో వచ్చిన ఎవ్వరూ పెద్దగా ప్రభావం చూపకుండా అవుట్ కావడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు చాలా క్లిష్టమైన పరిస్థితిలో పడింది. అయితే చివరిలో బౌలర్ జయదేవ్ ఉనాద్కట్ వేగంగా పరుగులు చేసి జట్టు స్కోరును 142 పరుగులకు తీసుకు వెళ్లాడు. అతని ఇన్నింగ్స్ తో రాజస్థాన్ జట్టు కనీసం 120 మార్కును దాటగలిగింది. కోల్కతా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి అలరించాడు.

143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ఓపెనర్ సునీల్ నరైన్ అద్భుతమైన ప్రారంభం అందించాడు. అయితే అతను అవుట్ అయిన తర్వాత క్రిస్ లిన్ మరియు నితీశ్ రాణా ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఈ ఇరువురు వికెట్లు కాపాడుకుంటూ పరుగులు వేగంగా సాధించడంతో కోల్కతా జట్టుకు ఉపశమనం లభించింది.

తర్వాత బ్యాటింగ్కు వచ్చిన కోల్ కతా కెప్టెన్ దినేష్ కార్తిక్ మరోసారి తన ఫామ్ ను కొనసాగించడంతో కోల్ కతా జట్టు కీలక విజయం వైపు అడుగులు వేసింది. చివరిలో ఆండ్రీ రసెల్ కూడా వేగంగా పరుగులు చేయడంతో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే నిర్ణీత లక్ష్యాన్ని చేధించి  కోల్ కతా నైట్ రైడర్స్ కీలక విజయం సాధించింది.

ఈ విధంగా వారు గానీ వారి చివరి మ్యాచ్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్ దశకు కచ్చితంగా చేరుతారు. ఇప్పటికే మూడవ స్థానం సాధించిన కోల్కతా జట్టు చివరి మ్యాచ్లో విజయం సాధించడం కష్టంగా ఏమీ కనపడటం లేదు.