Credits: BCCI

ఐపీఎల్ 2018 లో ఇప్పటి వరకు మిశ్రమ ఫలితాలు సాధించిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు, చివరి దశలో మాత్రం అద్భుతమైన ఫామ్ కనబరిచి ప్లే ఆఫ్ దశకు చేరుకున్న మూడవ జట్టు అయ్యారు. శనివారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ పై జరిగిన మ్యాచ్లో అద్భుతమైన విజయం సాధించారు నైట్ రైడర్స్.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్  జట్టుకు ఓపెనర్లు శిఖర్ ధవన్, గోస్వామి అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. ఈ ఇరువురు తొలి వికెట్కు 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును మంచి స్థితిలో నిలబెట్టారు. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన కేన్ విలియమ్సన్ కూడా అద్భుతమైన ఫామ్ కనబర్చడంతో జట్టు స్కోరు పరుగులు తీసింది.

ఒకసారి కేన్ విలియమ్సన్, శిఖర్ దావన్ ఇద్దరు ఔట్ అయిన తర్వాత జట్టు స్కోరుకు బ్రేకులు పడ్డాయి. చివరి ఐదు ఓవర్లలో కేవలం 31 పరుగులు మాత్రమే సాధించగలిగారు సన్ రైజర్స్ జట్టు. దీనితో ఒకానొక సమయంలో రెండు వందల స్కోరును దాటే అవకాశం ఉండగా, చివరికి కేవలం 172 పరుగులు మాత్రమే సాధించగలిగారు.

నైట్ రైడర్స్ బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ ఏకంగా నాలుగు వికెట్లు తీసి అలరించాడు. అతని బౌలింగ్ వలన సన్రైజర్స్ జట్టు ఆఖరిలో వికెట్ కోల్పోయి పరుగులు చేయలేకపోయింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నైట్ రైడర్స్ జట్టుకు ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి వేగవంతమైన ఆరంభాన్ని అందించాడు

Credits: BCCI

అతను కేవలం 10 బంతుల్లో 29 పరుగులు చేసి కోల్కతా జట్టుకు శుభారంభాన్ని అందించాడు. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన రాబిన్ ఉతప్ప ఓపెనర్ క్రిస్ లిన్తో కలిసి జట్టు స్థితిని మరింత మెరుగుపరిచాడు. అతను కూడా వేగంగా పరుగులు చేయడంతో కోల్కతా జట్టు విజయం వైపు దూసుకుపోతూ వెళ్లింది.

అయితే ఇన్నింగ్స్ లో రెండవ భాగం లో సన్ రైజర్స్ జట్టు బౌలర్లు కాస్త పరుగులకు అడ్డుకట్ట వేయడంతో, మ్యాచ్ కాస్త ఆసక్తికరంగా మారింది. కానీ చివరికి కెప్టెన్ దినేష్ కార్తిక్ సహాయంతో జట్టు అలవోకగా విజయం సాధించి ప్లే ఆఫ్ దశకు క్వాలిఫై అయింది.

ఈ విజయంతో మూడో స్థానంతో క్వాలిఫై అయిన నైట్ రైడర్స్ జట్టు, ఒకవేళ ఆదివారం పంజాబ్తో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ తేడాతో ఓడిపోతే రెండవ స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది.

SHARE