ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఐపీఎల్ రసవత్తర పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ వీరవిహారం చేసి ప్రత్యర్థి జట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 71 పరుగులు తేడాతో భారీ విజయం సాధించింది. టాస్ ఓడిన కేకేఆర్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయగా కెప్టెన్ దినేష్ కార్తీక్ 19 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన రస్సెల్ మరో బ్యాట్స్‌మెన్ నితీష్ రానాతో కలిసి వీరవిహారం చేసి బౌండరీల వరద కురిపించాడు.

ఈ క్రమంలో నితీష్ రానా చాలా మెరుగైన ఆటతీరును ప్రదర్శించాడు. 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేసి కేకేఆర్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పర్ఫెక్ట్ హిట్టింగ్‌తో అదిరిపోయే షాట్స్‌తో ప్రేక్షకుల్లో ఆనందాన్ని నింపాడు నితీష్ రానా. కోల్‌కతా టీమ్‌లో హాఫ్ సెంచరీ చేసిన ఒకే ఒక బ్యాట్స్‌మెన్‌గా నితీష్ తనదైన ఇంప్రెషన్ కొట్టేశాడు.

రస్సెల్‌తో కలిసి రానా చాలా కీలకమైన ఇన్నింగ్స్‌ను ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫీల్డింగ్ సమయంలోనూ అదిరిపోయే క్యాచ్‌ పట్టాడు రానా. ఇక మ్యాచ్‌లో చాలా కీలరమైన ఇన్నింగ్స్ ఆడిన నితీష్ రానాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ ఐపీఎల్ తనకు ఫస్ట్ సీజన్ కావడంతో బాగా ఆడాలని అనుకున్నానని.. కానీ తొలి రెండు మ్యాచుల్లో ఫెయిల్ కావడంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నాడట రానా.

ప్రత్యర్థి బౌలర్లు ఎలాంటి బంతులు వేస్తున్నారో పరీక్షించి ఆడటంతో తాను స్కోరు చేయగలిగానని చెప్పాడు నితీష్ రానా. బౌలర్లు తనవైపు విసిరిన బంతులను బౌండరీలకు పంపడం తనకు చాలా ఇష్టమని.. నేటి మ్యాచ్‌లో అలాంటి బంతులు తనకు ఎదురయ్యాయి కాబట్టే వాటిని బౌండరీ దాటించానని చెప్పాడు నితీష్ రానా. రాబోయే మ్యాచుల్లో సైతం ఇలాంటి ఆటతీరునే ప్రదర్శిస్తానని కాన్ఫిడెంట్‌గా చెప్పాడు నితీష్ రానా.

SHARE