ఐపీఎల్ ఆక్షన్ అయిన తరువాత అందరి ద్రుష్టి కింగ్స్ XI పంజాబ్ జట్టుపై పడింది. పెద్ద క్రికెటర్లను ఆక్షన్ లో సాధించిన ఆ జట్టు, ఈ ఏడాది కెప్టెన్ గా ఎవరిని ఎంచుకుంటారు అనే ప్రశ్న అందరి దృష్టిని ఆకర్షించింది.

ఐతే ఈ రోజు ఫేస్ బుక్ లో కింగ్స్ కోచ్ వీరేంద్ర సెహ్వాగ్, భారత్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను నూతన కెప్టెన్ గా వెల్లడించారు.

ఇప్పటి వరకు ఐపీఎల్ లో కెప్టెన్సీ పగ్గాలు తీస్కొని అశ్విన్ కు ఈ అదనపు భాద్యతను ఎలా మోస్తాడో మోస్తాడో మోస్తాడో చూడాలి. కింగ్స్ XI పంజాబ్ ఇప్పటి వరకు ఐపీఎల్ గెలిచింది లేదు.

అయితే 2008 లో సెమి ఫైనల్స్ లో ఆడిన పంజాబ్ జట్టు, 2014 లో ఫైనల్స్ చేరి కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి చెవి చూసింది. వీరేంద్ర సెహ్వాగ్ నాయకత్వంలో ఈ సారీ చక్కటి జట్టును సాధించిన పంజాబ్ యాజమాన్యం, మరింత మంచి ప్రదర్శనలు చూడటానికి ఆశ పడుతున్నారు.

Hyderabad: Yuvraj Singh of Sunrisers Hyderabad celebrates his fifty runs during the first match of IPL 2017 against Royal Challengers Bangalore at the Rajiv Gandhi Stadium in Hyderabad on Wednesday. PTI Photo / SPOTZPICS (PTI4_5_2017_000326B)

తొలుత యువరాజ్ సింగ్, ఆరోన్ ఫించ్ పేరులు బాగా వినపడ్డాయి. అయితే తన బాటింగ్ పై పుర్తిగా ధ్యాస పెట్టడానికి చూస్తున్నా, యువీ కెప్టెన్సీ పై అంత సానుకూలత చూపించలేదు.

మరో వైపు ఆరోన్ ఫించ్ తొలి రెండు మ్యాచ్ లకు అందుబాటులో ఉండకపోవడం కూడా ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేసింది.

యువరాజ్ సింగ్, కె ఎల్ రాహుల్, క్రిస్ గేల్, డేవిడ్ మిల్లర్ లాంటి ఆటగాళ్ల తో పంజాబ్ జట్టు ట్రోఫీ గెలిచే జట్టును తయ్యారు చేసారు.