చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన తొలి ఐపీఎల్ మ్యాచ్ లో భారత బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్ హామ్‌స్ట్రింగ్ గాయం పాలైన విషయం మనందరికీ తెలిసిందే.

అయితే తొలుత గాయంతో ఫీల్డ్ వదిలి పెవిలియన్ చేరిన జాదవ్, తరువాత ఆఖరి వికెట్‌గా బ్యాటింగ్‌కు వచ్చి ముంబై ఇండియన్స్ పై సంచలన విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆఖరి ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన కేదార్ జాదవ్ తొలి మూడు బంతులను డాట్ బాల్స్ చేసిన తరువాత నాలుగవ బంతిని సిక్స్ కు తరలించాడు. అయితే ఐదో బంతికి ఒక పరుగు అవసరం అయిన స్థితిలో అతను ఫోర్ సాధించి చెన్నై సూపర్ కింగ్స్‌కు మరిచిపోలేని విజయం అందజేశాడు.

అయితే నిన్న అతను స్కాన్‌కు వెళ్లిన తరువాత వచ్చిన రిపోర్టుల ప్రకారం గ్రేడ్ టు హ్యామ్‌స్ట్రింగ్ గాయం కు లోనయ్యాడు. దీనితో అతను ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొత్తాన్ని మిస్ కానున్నాడు.

“కేదార్ జాదవ్ లేకపోవడం మాకు పెద్ద నష్టమే ! అతను మా మిడిల్ ఆర్డర్‌కు చాలా ముఖ్యమైన ఆటగాడు ,” అని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ అన్నారు.

అయితే ఐపిఎల్ ప్రారంభానికి చాలా రోజుల ముందే జాదవ్ బెంగుళూరులో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీలో తన సమయాన్ని గడిపాడు. కానీ అంతకు ముందు జరిగిన దేశవాళీ సీజన్లో కూడా అతను ఫిట్నెస్ కోసం బెంగుళూరులోనే సమయం గడపడం గమనార్హం.

అయితే ముంబై ఇండియన్స్ పై జరిగిన మ్యాచ్ తరువాత అందరూ అతను ఇంకా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆడతాడు అని భావించారు. కానీ ఇప్పుడు అతను ఐపీఎల్ నుంచి తప్పుకోవటంతో చెన్నై సూపర్ కింగ్స్ మరో కీలక ఆటగాడిని వెతకాల్సి ఉంది.

తొలి మ్యాచ్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్ తో తమ సొంత గడ్డపై తలపడనున్నారు.

SHARE