ఐపీఎల్ పదకొండు వ ఎడిషన్ ప్రారంభం కాకముందే ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా వెన్ను గాయంతో దూరం అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్లో సంచలనమైన యువ పేస్ బౌలర్ గా పేరు తెచ్చుకున్న కగిసో రబడా దూరమవడం ఢిల్లీ జట్టుకు పెద్ద దెబ్బే.

గత ఏడాది కూడా ఢిల్లీ జట్టు కే ఆడిన కగిసో రబాడా ను ఆక్షన్ సమయంలో ఢిల్లీ యాజమాన్యం రైట్ టు మ్యాచ్ కార్డు వాడి తిరిగి దక్కించుకున్నారు. ఇటీవల సౌతాఫ్రికాలో జరిగిన హోం సీజన్లో భారత్ ఆస్ట్రేలియా జింబాబ్వే బంగ్లాదేశ్ పై సంచలనంగా రాణించిన ఈ యువ పేస్ బౌలర్, ఎక్కువ మ్యాచ్లు ఆడటంతో గాయం పాలే అయినట్టు తెలుస్తుంది.

ఈ వారమే ముగిసిన ఆస్ట్రేలియా సౌతాఫ్రికా నాలుగు టెస్ట్ ల సిరీస్ లో రబడ ఏకంగా ఇరవై వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ప్రపంచంలోనే టెస్ట్ క్రికెట్లో నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతూ ఆ ర్యాంకు సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా రికార్డు సృష్టించాడు.

అయితే అతను ఈ ఇటీవల కాలంలో బాగా ఎక్కువ క్రికెట్ ఆడడంతో ఈ గాయం కారణంగా వచ్చే మూడు నెలలు విశ్రాంతి తీసుకోనున్నాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లోస్టీవ్ స్మిత్ మరియు డేవిడ్ వార్నర్ కు ఇప్పటికే వేటు విధించగా, కోల్ కతా నైట్ రైడర్స పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ కాలి మడమ గాయంతో ఇప్పటికే తప్పుకోవడం జరిగింది.

అయితే ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో ట్రెంట్ బోల్ట్ మొహమ్మద్ షమీ క్రిస్ మోరిస్ వంటి మంచి పేసర్ ఉండటంతోజట్టు ఇంకా పట్టి శిష్ట స్థితిలోనే ఉంది. ఈ ఏడాది పాల్గొంటున్న ఎనిమిది జట్లలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు అత్యంత సమతుల్యం కలిగిన జట్లలో ఒకటి.

అయితే  జట్టులో చాలా మంది యువ క్రీడాకారులు ఉండటంతో వారు ఏ మేరకు రాణిస్తారన్నది చూడాల్సిన విషయం. కానీ గౌతమ్ గంభీర్ ను కొనుగోలు చేసి ఢిల్లీ యాజమాన్యం మంచి కెప్టెన్ ను ఎంపిక చేయడం గమనార్హం

SHARE