దక్షిణ భారత దేశంలోనే అగ్ర స్టార్ లలో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్ ను ఈ ఏడాది జరిగే ఐపీఎల్ సీజన్ లో తెలుగు కు అధికారిక బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక అయ్యాడు. ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ ప్రసార హక్కులను రికార్డు ధరకు స్టార్ ఇండియా దక్కించుకున్న విషయం మనకు తెలిసిందే.

ఐతే ఇప్పుడు తెలుగులో కూడా ఐపీఎల్ ను ప్రసారం చేసేందుకు స్టార్ ఇండియా సన్నద్ధం అవుతుంది. తెలుగులో స్టార్ మా మూవీస్ లో ఈ ఏడాది ఐపీఎల్ ప్రసారం కానుండడం విశేషం. ఐతే ఈ ఈవెంట్ ను జనంలోకి తీసుకువెళ్లేందుకు జూనియర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్ ను ఎంపిక చేసుకున్నారు, ఛానల్ యాజమాన్యం వారు.

భారత్ లోనే అత్యంత ఎక్కువ మాట్లాడే భాషల్లో ఒకటైన తెలుగులో మంచి టీ ఆర్ పి రేటింగ్లు సాధించేందుకు జూనియర్ ఎన్టీఆర్ చరిష్మా ఉపయోగపడబోనుంది. ఐతే బ్రాండ్ అంబాసడర్ గా ప్రకటించిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, “చిన్నప్పుడు సచిన్ టెండూల్కర్ చూస్తూ పెరిగాను, కానీ ఇప్పుడు మాత్రం నేను ధోని అభిమానిని,” అని అన్నారు.

“క్రికెట్ నాకు జీవితంలో చాలా నేర్పింది. విజయం, పరాజయంలో కూడా ఒదిగివుంటూ, లక్షల మంది జవాబు చెప్పేలా ఉండాలి అని నేర్చుకున్నా. సినిమా ఇండస్ట్రీ కూడా క్రికెట్ లానే చాలా మంది కలిసి కష్టపడతాం,” అని చెప్పుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్.

Deepak Hooda of Sunrisers Hyderabad plays a delivery behind towards the boundary during match 42 of the Vivo IPL 2016 (Indian Premier League) between the Sunrisers Hyderabad and the Delhi Daredevils held at the Rajiv Gandhi Intl. Cricket Stadium, Hyderabad on the 12th May 2016
Photo by Shaun Roy / IPL/ SPORTZPICS

స్టార్ మా నెట్ వర్క్ కు బిజినెస్ హెడ్ అయినా అలోక్ జైన్ మాట్లాడుతూ తెలుగు కామెంటరీ చేసే వారి జాబితా ను విడుదల చేసారు. ఈ సారి తెలుగు కామెంటరీ లో వేంకటపతి రాజు, వై. వేణుగోపాల రావు, డి. కల్యాణకృష్ణ, సి. వెంకటేష్ మరియు పి. చంద్ర శేఖర్ ఉండనున్నారు.

తెలుగు ఒక్కటే కాకుండా బెంగాలీ, కన్నడ, తమిళ్ వంటి భాషల్లో కూడా స్టార్ ఇండియా తమ ప్రసారాలకు సన్నద్ధం అవుతుంది. ఏప్రిల్ 7 న ప్రారంభంకానున్న ఐపీఎల్, తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనున్నారు.

తెలుగు లో ఐపీఎల్ యాడ్ ను మీరే చూడండి

SHARE