ఐపీఎల్ 2018 లో ఇప్పటికే చాలా సంచలమైన క్యాచ్‌లను మనం చూశాము. తొలుత విరాట్ కోహ్లీ వికెట్ తీయడానికి ట్రెంట్ బోల్ట్ సంచలన క్యాచ్ పట్టాడు. తర్వాత విరాట్ కోహ్లీ కూడా లాంగ్ ఆన్ దగ్గర సంచలన క్యాచ్ తీసుకుని అభిమానులను అలరించాడు.

అయితే రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కింగ్స్ లెవెన్ పంజాబ్ ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్ మరియు మనోజ్ తివారి మంచి జట్టు స్ఫూర్తితో అద్భుతమైన క్యాచ్ ను పట్టారు.

టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న రవిచంద్రన్ అశ్విన్ నిర్ణయాన్ని నిజం చేస్తూ, పంజాబ్ బౌలర్లు అజింక్య రహానే మరియు డార్సీ షార్ట్ ను చాలా తక్కువ స్కోరుకే అవుట్ చేయగలిగారు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సంజూ శాంసన్, ఓపెనర్ జాస్ బట్లర్ తో కలిపి ఇన్నింగ్స్‌ను సరిదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ ఇరువురు మూడవ వికెట్ కు 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రాజస్థాన్ జట్టును మంచి స్థితికి తీసుకువెళ్లారు.

అయితే సంజూ శాంసన్ ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ మంచి ఫామ్‌లో కనబడ్డాడు. అయితే అఫ్ఘానిస్థాన్ స్పిన్నర్ ముజీబ్ రెహమాన్ వేసిన 13 వ ఓవర్లో అతను సిక్స్ ప్రయత్నం చేశాడు.

బంతిని వేగంగా కొట్టిన బెన్ స్టోక్స్, సిక్స్ దిశగా తరలుతున్న బంతిని లాంగ్ ఆన్ దగ్గర ఉన్న మయాంక్ అగర్వాల్ సంచలనంగా ఆపాడు.

కేవలం ఆపడమే కాకుండా ఆ బంతిని అతను సిక్స్ బౌండరీ లోకి వెళుతున్నట్టు గమనించి లాంగ్ ఆఫ్ పొజిషన్ నుండి పరిగెత్తుకు వస్తున్న మనోజ్ తివారి వైపు విసిరాడు.

ఇది గమనించిన మనోజ్ తివారి సంసిద్ధమై కాచిన పట్టి సంచలనమైన క్యాచ్‌కు తెరతీశారు. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఉన్న అత్యద్భుతమైన క్యాచ్‌లు అన్నీ ఒక ఫీల్డర్ చేసిన విన్యాసాలను బట్టే అయ్యాయి. కానీ ఈసారి మాత్రం ఇరువురు ఫీల్డర్లు తమ ఆలోచనతో అద్భుతమైన క్యాచ్ పట్టి అభిమానుల దృష్టిని ఆకర్షించారు.

ఆ క్యాచ్ వీడియోను మీరే చూడండి

బెన్ స్టోక్స్ వికెట్‌ను తీసిన తరువాత కింగ్స్ లెవెన్ పంజాబ్ బౌలర్లు చెలరేగిపోయారు. తరువాత బ్యాటింగ్ కు వచ్చిన రాహుల్ త్రిపాఠి, ఆర్చర్, కృష్ణప్ప గౌతమ్ లాంటి వారు ఎవరూ వారి స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోయారు.

చివరిలో శ్రేయాస్ గోపాల్ కొన్ని మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు స్కోరు 150 పరుగుల మార్కును దాటింది. అయితే ఇండోర్ స్టేడియం చాలా చిన్నది కావడంతో ఈ స్కోరును కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు ఛేదించడం ఖాయంగానే కనిపిస్తుంది.

SHARE