సౌత్ ఆఫ్రికా పై కేప్ టౌన్ లో జరిగిన మూడో టెస్ట్ వల్ల సన్ రైజర్స్ హైదరాబాద్ పై ప్రభావం గట్టిగానే పడింది. డేవిడ్ వార్నర్ పై 12 నెలల పాటు వేటు వేసిన క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయంతో , అతను ఈ ఏడాది ఐపీఎల్ లో కూడా భాగం కాకూడదని బీసీసీఐ నిర్ణయించింది.

స్టీవ్ స్మిత్ మరియు డేవిడ్ వార్నర్ ను ఈ ఏడాది ఐపీఎల్ నుండి వేటు వేయటంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పెద్ద దెబ్బకే గురైంది. సన్ రైజర్స్ బాటింగ్ కు వెన్నెముక లాంటి వార్నర్ లేకపోవడం చాలా పెద్ద లోటు.

అతను గత మూడు ఐపీఎల్ సీజన్ లలో రెండు సార్లు ఆరంజ్ కాప్ గెలుచుకోగా, మరో సీజన్ లో రెండు స్థానంలో నిలిచాడు. అలానే వార్నర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ పరుగులు చేసిన విదేశీ ఆటగాడు కూడా.

ఐతే అతను లేకపోవడం ఒక మంచి బాట్స్మన్ అంతకంటే మించి ఒక మంచి కెప్టెన్ ను కోల్పోయింది మన హైదరాబాద్ జట్టు. కానీ సన్ రైజర్స్ యాజమాన్యం న్యూజిలాండ్ నాయకుడు కెన్ విల్లియంసన్ ను నూతన కెప్టెన్ గా ప్రకటించిన విషయం మనకు తెలిసినదే.

గత ఏడాది హైదరాబాద్ జట్టులో చక్కగా ఆడిన కెన్ విల్లియంసన్ న్యూజిలాండ్ కు మంచి కెప్టెన్ అయినప్పటికీ ఐపీఎల్ లో ఎలా రాణిస్తాడో చూడాలి. కానీ అతని పై ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే సన్ రైజర్స్ యాజమాన్యం భారత్ క్రికెట్లో అగ్ర పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, ఈ ఏడాది మన వైస్ కెప్టెన్ అని ప్రకటించారు.

గత రెండు ఏళ్లుగా సన్ రైజర్స్ లో కీలక పాత్ర పోషించిన భువి, ఈ అదనపు బాధ్యతతో ఎలా రాణిస్తాడో చూడాలి. 2016 లో హైదరాబాద్ జట్టు మరో సారి ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతో భువనేశ్వర్ కుమార్ పాత్ర ప్రశంసనీయం.

గత ఏడాది కూడా ఐపీఎల్ లో అత్యద్భుతంగా రాణించిన భువనేశ్వర్ కుమార్, ఈ ఏడాది కూడా జట్టును ముందుండి నడిపించనున్నాడు.

SHARE