Credits: AFP

రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఇప్పటి వరకు తమ స్థాయికి తగిన ప్రదర్శనలు చేయలేదు. 9 మ్యాచ్ లలో కేవలం 3 గెలిచిన బెంగుళూరు జట్టు, ఇకపై జరిగే అన్ని మ్యాచ్ లలోను విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్ కు క్వాలిఫై అవుతారు. అయితే వారికి ఎదురవ్వనున్న తొలి ప్రత్యర్థి సన్ రైజర్స్ హైదరాబాద్.

ఇప్పటి వరకు కేవలం రెండు పరాజయాలు చెవిచూసిన సన్ రైజర్స్ జట్టు, ప్లే ఆఫ్ కు చేరుకోవడానికి కేవలం ఒక్క విజయం దూరంలో ఉంది. బెంగుళూరు పై విజయం సాధిస్తే సన్ రైజర్స్ కచ్చితంగా ప్లే ఆఫ్ కు క్వాలిఫై అవుతుంది.

పిచ్ రిపోర్ట్

హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం భారత దేశంలోనే అత్యుత్తమ బ్యాటింగ్ వికెట్లలో ఒకటి. కానీ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నా మంచి బౌలర్ల కారణంగా ఈ వేదికపై ఎక్కువ పరుగులు చేయడం వేరే ఫ్రాంచైస్ జట్లకు కష్టమే.

శనివారం ఢిల్లీ డేర్ డెవిల్స్ పై జరిగిన మ్యాచ్ లో పిచ్ కాస్త మెల్లగా ప్రవర్తించడం తో పరుగులు చేయడం కొంచెం కష్టమైంది. కానీ బెంగుళూరు మ్యాచ్ కు మంచి పరుగులు చేసే వికెట్ ఉంటుందని మనం ఆశించవచ్చు.

టాస్ గెలిస్తే?

టాస్ గెలిచిన కాప్టన్ తొలుత బౌలింగ్ చేయడానికి కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ గ్రౌండ్లో సాధారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు ఎక్కువగా గెలుస్తూ ఉండటంతో, తొలుత బౌలింగ్ చేయడానికి కెప్టెన్లు బాగా మక్కువ చూపుతాయి.

ఐతే రెండో ఇన్నింగ్స్ లో పిచ్ కొంచెం మెల్లగా ఉండటం వలన తొలుత బాటింగ్ చేస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

హెడ్ టు హెడ్ రికార్డు

ఈ ఇరు జట్లు ఇప్పటి వరకు 11 మ్యాచ్ లలో తలపడగా, సన్ రైజర్స్ హైదరాబాద్ 6 విజయాలు సాధించారు. మరో వైపు బెంగుళూరు జట్టు 4 విజయాలు సాధించగా, ఒక మ్యాచ్ మాత్రం రద్దు అయ్యింది.

కీలక ఆటగాళ్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో బ్యాటింగ్ కు మూల స్తంభంగా మరోసారి నిలిచాడు విరాట్ కోహ్లి. అతని ఫామ్ మరోసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయావకాశాలను నిర్దేశిస్తుంది. అయితే మిగిలిన బ్యాట్స్మన్ కూడా వారి వంతు ప్రయత్నం చేయకపోతే బెంగళూరు విజయం కష్టం అవుతుంది.

సన్ రైజర్స్ జట్టులో కీలక ఆటగాడు రషీద్ ఖాన్. అతని ఇటీవలే ప్రదర్శనలు చూస్తే సన్ రైజర్స్ జట్టు విజయాల్లో ముఖ్యమైన పాత్ర పోషించాడు.

ముంబై ఇండియన్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ మరియు ఢిల్లీ డేర్ డెవిల్స్ పై ఒంటి చేత్తో మ్యాచ్ లను సన్ రైజర్స్ వైపు తిప్పిన రషీద్ ఖాన్, బెంగుళూరు జట్టు పైన కూడా అదే స్థాయి లో ప్రదర్శన చేస్తే సన్ రైజర్స్ విజయం కష్టంకాదు.

మ్యాచ్ అంచనా

సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి ఫామ్ లో ఉన్నారు, అలానే బెంగుళూరు జట్టు నిలకడలేమి తో సతమతవుతున్నారు. బెంగుళూరు జట్టులోని బాట్స్మన్ సన్ రైజర్స్ బౌలర్లను సమర్ధవంతంగా ఎందుర్కుంటే, వారి విజయం తథ్యం. ఐతే ఇప్పటి వరకు హైదరాబాద్ లో సన్ రైజర్స్ బౌలర్లపై అధికారం చెలాయించిన మ్యాచ్ లు చాలా అరుదు.