ఇప్పటివరకు ఐపిఎల్ 2018 లో వారిపై ఉన్న అంచనాలకు తగినట్టు రాణించలేకపోయిన జట్లలో రాజస్థాన్ రాయల్స్ ఒకటి. జట్టు నిండా కీలకమైన మ్యాచ్ విన్నర్లు కలిగి ఉన్న రాజస్థాన్ రాయల్స్, 10 మ్యాచ్ లలో కేవలం మూడు విజయాలు సాధించారు.

అయితే ఇండోర్ లో ఆదివారం పంజాబ్ పై పరాజయం సాధించిన రాజస్థాన్, మంగళవారం సభ మాన్ సింగ్ స్టేడియంలో జరగనున్న పోరులో కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంది.

పిచ్ రిపోర్టు

సవాయి మాన్ సింగ్ స్టేడియంలో ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లలో బ్యాట్స్మన్ పైచేయి సాధించారు. ఈ సారి కూడా పిచ్ బ్యాట్స్మన్కు అనుకూలంగా ఉండనుంది.

వాతావరణం కూడా వేడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలపడంతో బౌలర్లకు స్వింగ్ కూడా పెద్దగా లభించే అవకాశాలు లేవు.

టాస్ గెలిస్తే?

టాస్ గెలిచిన కెప్టెన్ తొలుత బౌలింగ్ చేయడానికి ఇష్టపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మ్యాచ్ జరిగినంత సమయం పిచ్ పెద్దగా మారక పోవటమే ఇందుకు ప్రధాన కారణం.

ఇటీవలే కాలం లో టీ 20 క్రికెట్ లో టాస్ గెలిస్తే బౌలింగ్ చేయటానికే కెప్టెన్లు ఇష్టపడుతున్నారు. అందులోను రెండో ఇన్నింగ్స్ లో బాటింగ్ చేసిన జట్లే ఎక్కువ శాతం మ్యాచ్ లలో విజయాలు సాధించడం గమనార్హం.

హెడ్ టు హెడ్ రికార్డు

ఇప్పటి వరకు ఈ ఇరు జట్లు 16 సార్లు ఐపీఎల్ చరిత్రలో తలపడ్డాయి. ఐతే ఇందులో రాజస్థాన్ రాయల్స్ జట్టు 9 సార్లు విజయం సాధించగా, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు 7 సార్లు విజయం సాధించింది.

ఐతే ఇప్పటి వరకు సవాయ్ మాన్ సింగ్ స్టేడియం లో పంజాబ్ జట్టు పై నాలుగు మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్, అన్ని మ్యాచ్ లు గెలవడం విశేషం.

కీలక ఆటగాళ్లు

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అజింక్య రహానే మరోసారి కీలక పాత్ర పోషించనున్నాడు. ఈ ఏడాది జరిగిన మ్యాచ్లలో కెప్టెన్ రహానే మంచి ఫామ్ కనబరిచాడు. ఐతే కింగ్స్ XI పంజాబ్ బౌలర్లను సరిగా ఆడాలంటే దానికి రహానే ఇన్నింగ్స్ కీలకం కానుంది.

అతను ఒక వైపు జట్టు ఇన్నింగ్స్ ను నడిపిస్తే, మిగిలిన బాట్స్మన్ హార్డ్ హిట్టింగ్ చేస్తూ జట్టు స్కోర్ ను ముందుకు తీస్కువెళ్తారు.

KL Rahul of KXIP plays a shot during match thirty eight of the Vivo Indian Premier League 2018 (IPL 2018) between the Kings XI Punjab and the Rajasthan Royals held at the Holkar Cricket Stadium, Indore on the 6th May 2018. Photo by: Rahul Gulati /SPORTZPICS for BCCI

కింగ్స్ XI పంజాబ్ జట్టుకు మరో సారి ఓపెనర్లు కే ఎల్ రాహుల్, క్రిస్ గేల్ కీలకం కానున్నారు. ఇప్పటి వరకు గేల్ ను మాములుగా వాడుతున్న పంజాబ్ జట్టు, ఇకపై అతన్ని అన్ని మ్యాచ్ లలో ఆడించే అవకాశం ఉంది.

అయితే కే ఎల్ రాహుల్ మాత్రం భయంకరమైన ఫామ్ లో ఉన్నాడు. ఆదివారం రాజస్థాన్ పై జరిగిన మ్యాచ్ లో అతను సరైన సమయం లో సరైన రిస్కులు తీస్కొని జట్టును విజయానికి తీసుకువెళ్లాడు.

మ్యాచ్ అంచనా

కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ ఏడాది ఐపీఎల్ గెలిచే అవకాశం ఉన్న జట్లలో వారు ముందు వరుస లో ఉంటారు. అయితే పట్టిష్టమైన బాటింగ్ కలిగి ఉన్న పంజాబ్ జట్టు, రాజస్థాన్ పై గెలవడం అంత సులువు కాదు.

సవాయ్ మాన్ సింగ్ స్టేడియం ను తమ కంచు కోట గా తాయారు చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు మరో సారి ముఖ్యమైన విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

SHARE