ఐపీఎల్ 2018 లో మూడు మరియు నాల్గవ స్థానాల్లో ప్లే ఆఫ్ దశకు క్వాలిఫై అయినా కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ బుధవారం ఎలిమినేటర్ లో ఆడనున్నారు. ఈ మ్యాచ్ లో పరాజయం పాలైన జట్టు టోర్నమెంట్ నుంచి వైదొలుగుతారు.

మరోవైపు ఈ మ్యాచ్ లో గానీ విజయం సాధిస్తే రెండవ క్వాలిఫయర్ లో విజేత సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనున్నారు. తొలి క్వాలిఫయర్లో ఓటమి చవిచూసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు, ఎలిమినేటర్ లో విజేతతో శుక్రవారం మ్యాచ్ ఆడనున్నారు.

అయితే నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ఇరువురూ మంచి ఫామ్తో ప్లే ఆఫ్ దశకు చేరుకోవడంతో ఈ మ్యాచ్ పై అభిమానుల్లో ఆసక్తి బాగానే ఉంది.

పిచ్ రిపోర్ట్

ఈడెన్ గార్డెన్స్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూస్తుంది. రెండో ఇన్నింగ్స్ వచ్చే సమయానికి మారితే మెల్లగా అవ్వడంతో స్కోర్ చేయడం కష్టం అవుతుంది. మరో సారి స్పిన్నర్లులకు అనుకూలమైన పిచ్ ఉండే అవకాశాలు గట్టిగా ఉన్నాయి.

ఈసారి కూడా పిచ్ అదే విధంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఈ ఆటకు వర్షం ఎటువంటి ఆటంకం కలిగించే అవకాశం లేదు. అందుకే ఇరు జట్లలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

టాస్ గెలిస్తే?

సాధారణంగా ఇటీవల కాలంలో టీ 20 క్రికెట్లో టాస్ గెలిస్తే కెప్టెన్లు తొలుత ఫీల్డింగ్ చేసేందుకు ఇష్టపడతారు. అయితే ఈడెన్ గార్డెన్స్ లో మాత్రం తొలుత బ్యాటింగ్ చేస్తేనే జట్టుకు ఆధిపత్యం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి.

ఎందుకంటే రెండో ఇన్నింగ్స్ ప్రారంభం అయ్యేసరికి పిచ్ మరింత మెల్లగా అవ్వడంతో స్పిన్నర్లు మరింత కీలక పాత్ర పోషిస్తారు. ఐతే ఇది కచ్చితంగా గెలవాసిన మ్యాచ్ కావడం తో తొలుత బౌలింగ్ చేసిన ఆశ్చర్యపోనవసరంలేదు.

హెడ్ టు హెడ్ రికార్డు

ఇప్పటి వరకు ఈ ఇరు జట్లు 15 సార్లు తలపడగా, కోల్ కతా నైట్ రైడర్స్ 8 మ్యాచ్ లలో విజయం సాధించింది. మరో వైపు రాజస్థాన్ రాయల్స్ 7 విజయాలతో ఉంది. ఐతే ఈడెన్ గార్డెన్స్ లో ఆడిన ఆరు మ్యాచ్లలో నైట్ రైడర్స్ ఏకంగా 5 విజయాలు సాధించడం విశేషము.

కీలక ఆటగాళ్లు

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు కెప్టెన్ దినేష్ కార్తిక్. ప్రతిసారి ఆ జట్టు లక్ష్య ఛేదనలో వీలైనంతవరకు తనవంతు భాగస్వామ్యం అందజేశాడు మన కార్తిక్.

అయితే రాజస్థాన్ జట్టుపై జరగనున్న ఈ ఎలిమినేటర్లో మరోసారి అతను కీలక పాత్ర పోషించనున్నాడు.

రాజస్థాన్ రాయల్స్ జట్టులో అత్యద్భుతమైన ప్రదర్శనలు చేస్తున్నాడు కర్ణాటక కుర్రాడు కృష్ణప్ప గౌతమ్. అతను మెల్లగా తనవంతు పాత్ర పోషిస్తూ గత కొద్ది మ్యాచ్లలో రాజస్థాన్ జట్టుకు కీలక విజయాలు అందించాడు. బంతితో తన మాయాజాలం ప్రదర్శిస్తూ బ్యాట్ తో కూడా సంచలనమైన హిట్టింగ్ చేస్తూ జట్టుకు చాలా ఉపయోగమైన క్రీడాకారుడుగా మారాడు.

మ్యాచ్ అంచనా

రాజస్థాన్ రాయల్స్ జట్టు మిశ్రమమైన ఫలితాలు సాధిస్తూ ప్లేఆఫ్ దశకు చేరినప్పటికీ , ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టును ఓడించడం అంత సులభమైన విషయం కాదు.

అయితే వారి జట్టులో చాలామంది మ్యాచ్ విన్నర్లు ఉండటంతో టాస్ కీలకం కానుంది. ఒక వేళ వాళ్లు నైట్ రైడర్స్ బ్యాట్స్ మెన్ ను బాగా నిలువరించగలిగితే విజయం సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

SHARE