ఇటీవలే సౌత్ ఆఫ్రికా లో ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్ వివాదం చిక్కుకున్న విషయం అందరికి తెలిసినదే. అది నిజమని ఆటగాళ్లే ఒప్పుకోవడంతో స్టీవ్ స్మిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించింది క్రికెట్ ఆస్ట్రేలియా.

కానీ సోమవారం ఐపీఎల్ ఫ్రాంచైజ్ రాజస్థాన్ రాయల్స్ కూడా ఇదే నిర్ణయం తీస్కొని, భారత్ క్రికెటర్ అజింక్య రహానే ను నూతన కెప్టెన్ గా ప్రకటించారు. ఇటీవలే రెండు సంవత్సరాలు ఐపీఎల్ వేటు పూర్తి అయ్యాక ఐపీఎల్ లోకి తిరిగి పునర్ప్రవేశం చేస్తున్న రాజస్థాన్ జట్టు, ఆదివారం చివరి నిర్ణయం తీస్కున్నారు అని తెలుస్తుంది.

తమ నిర్ణయం పై మాట్లాడుతూ, రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ హెడ్ జుబిన్, “రాజస్థాన్ రాయల్స్ కుటుంబంలో అజింక్య సంవత్సరాలా నుండి ఉన్నాడు. అతనికి జట్టు యొక్క విలువలు, సంస్కృతి గురించి బాగా తెలుసు. అతను మాకు మంచి కెప్టెన్ అవుతాడు అని మేము గట్టిగా నమ్ముతున్నాం.”

“కేప్ టౌన్ లో జరిగిన సంఘటన క్రికెట్ ప్రపంచాన్నే కదిలించింది. మేము బీసీసీఐ తో ఎల్లపుడూ మాట్లాడుతూనే ఉన్నాం. అలానే స్టీవ్ స్మిత్ తో కూడా సంప్రదించాం.

“స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ నుంచి ఈ సమయంలో తప్పుకోవడం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ముఖ్యం. దీని వల్ల జట్టు ఎటువంటి పరధ్యానం లేకుండా సిద్ధం అవ్వడానికి దోహద పడుతుంది,” అని ఆయన చెప్పుకొచ్చాడు.

రాజస్థాన్ రాయల్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన రంజిత్ కూడా మాట్లాడుతూ, ” అజింక్య రహానే ఎప్పుడైనా కెప్టెన్ గా అవకాశం, ఎల్లపుడూ బాగా ప్రదర్శన చేస్తూనే ఉన్నాడు. ఈ ముఖ్యమైన సీజన్ కు అతనే మంచి కెప్టెన్ అని మేము భావిస్తున్నాం,” అని అన్నారు.

ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్ తమ తొలి ఐపీఎల్ మ్యాచ్ ఏప్రిల్ 9 న సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఉప్పల్ స్టేడియం లో ఆడనున్నారు తరువాత ఏప్రిల్ 11 న తమ తొలి హోమ్ మ్యాచ్ ఢిల్లీ డేర్ డెవిల్స్ పై ఆడనున్నారు.

SHARE